- సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్
- భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు
- టెండర్లు యదా తదం దోపిడీ కామన్
- భక్తుల జేబులు గుల్ల
వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి లక్షల రూపాయలు రికార్డుల్లో నమోదు చేసి మమ… అని.. అనిపిస్తున్నారట. ప్రతీ ఏటా టెండర్ల రూపంలో వచ్చిన ఆదాయాన్ని గుడి పరిసర ప్రాంతాలకు వినియోగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో పెట్టడం లేదట. ఇక పూర్తి వివరాలోకి వెళితే జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయానికి ఉన్న చరిత్ర అంతో.. ఇంతో కాదు. చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. ఆ.. తల్లికి ఎవరైనా సరే వచ్చి మొక్కులు మొక్కారంటే చాలు.. వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతీ యేటా జనవరి నెలలో వార్షికోత్సవాలు ప్రారంభం కావడంతో చుట్టు ప్రక్కల వారే కాకుండా పరిసర జిల్లాల నుండి, హైద్రాబాద్ జంట నగరాల నుండి ఎందరో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారి వద్ద నుండి ఇటు నగదు రూపంలోనే కాకుండా ఆభరణాల రూపంలో గుడికి ఆదాయం భారీనే వస్తుంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నవిదంగా అమ్మవారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు కనీసం మంచి నీటి వసతులు ఏర్పాటు చూస్తేనే సీన్ అంతా అర్థమౌతుంది అంటూ ఆలయ నిర్వహణపై భక్తులు మండిపడుతున్నారు.
భక్తులకు పార్కింగ్ స్థలం లేక ప్రైవేట్ స్థలాలలో పార్కింగ్ చెస్తే వారి వద్దనుండి వేల రూపాయలను దండుకుంటున్నారని వాపోతున్నారు. కనీసం వారికి నీటి ట్యాంక్ ని శుభ్రం చేయడానికి కూడా వారికి సమయం దొరకడం లేదా…? నీటి ట్యాంక్ ఉన్నా ట్యాబ్ గత 15 రోజుల కిందట విరిగి ఉంటే దానికి ప్లాస్టిక్ కవర్లు పెట్టి అమర్చారు తప్ప వాటిని మార్చాలని తెలియటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. గుడి స్థలాలలో మరుగు దొడ్లు నిర్మించి వాటిపై డబ్బులు వసూలు చేయడం ఏంటని, భక్తుల నుండీ వచ్చే ఆదాయం ఏటుపోతుందో అంటూ మండిపడుతున్నారు. అంతే కాదండోయ్ ప్రతీ ఏటా వార్షికోత్సవాలు ప్రారంభం అయ్యాయంటే చాలు ముందుగానే గుడి గోపురం నుండీ అన్నింటికీ రంగు రంగుల కల్లర్లు వేసి విద్యుత్ లైట్లతో అలంకరించే వారని ఇప్పుడేమో రంగులు వేసినట్టు ఫోటోలు తీసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారని రంగులు మాత్రం అక్కడక్కడ రుద్ది కవర్ చేశారని చుట్టుప్రక్కల వారు గుస.. గుసలాడుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు కాస్త కొండపోచమ్మ అమ్మవారిపై దృష్టి పెట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయం ఎదుట ఉన్న నీటి సమస్యతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.