ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.
మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26. 75 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్‌దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు, రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ కూడా ఆర్షదీప్ కోసం బీడ్ వేసిన చివరికి రూ.18 కోట్లతో పంజాబ్ అయినను సొంతం చేసుకుంది.