Wednesday, January 22, 2025
spot_img

మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల పోరుబాట

Must Read
  • మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు
  • ఆందోళనకారుల అరెస్ట్‌తో గ్రామంలో ఉద్రిక్తత

నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం(Mailaram)లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ’మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ? గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉధృతం చేశారు. గ్రామంలోనికి పోలీసులను రానీయకుండా ముళ్లకంచెలు వేశారు. మైలారం గ్రామస్తులు చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతు తెలపడానికి హైదరాబాద్‌ నుండి బయలుదేరి వచ్చిన పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మణ్‌ లను కూడా పోలీసులు వెల్దండ వద్ద అడ్డగించి అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మైనింగ్‌ కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన కొనసాగుతోంది. అయితే రైతులు, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్రమ అరెస్టులు ఆపాలంటూ గ్రామస్తులు డిమాండ్‌ చేసారు.

గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. మైలారం గ్రామంలో ఉండే గుట్టపై క్వార్‌డ్జ్‌ ఖనిజాలను మైనింగ్‌ చేసేందుకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా అక్కడ మైనింగ్‌ జరుగుతోంది. అనుమతుల నియమాలకు వ్యతిరేకంగా ఈ మైనింగ్‌ జరుగుతోందని పేర్కొంటూ గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు. మైనింగ్‌పై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, గ్రామ తీర్మానం కూడా ఫేక్‌గా సృష్టించి మైనింగ్‌ జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇటీవల హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కూడా సంఫీుభావం తెలిపారు. దీంతో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని గ్రామ సభ తీర్మానించింది. దీనికి హరగోపాల్‌ను ముఖ్య అతిధిగా పిలిచారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు గ్రామానికి వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు రావద్దంటూ మహిళలు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన చేపట్టారు. చాలా కాలంగా మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మైలారం గ్రామంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మైలారం మైనింగ్‌ వెలికితీత కార్యక్రమాన్ని నిలిపివేయాలని గత మూడు నెలలుగా ఆ గ్రామస్తులు శాంతియుత పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని మహిళలను, రైతులను అరెస్ట్‌ చేశారు. అలాగే అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS