ఓ మనిషి మరవా,నువ్వు మనిషివన్నా సంగతే మారిచిపోతున్నవా..కండ్ల ముందు ఇన్ని
అన్యాయాలు,అక్రమాలు జరుగుతున్న నోరు మెదపవెందుకు..నీ నోరు మూగబోయిందా..మెదడు
మొద్దుబారుతుందా..నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమెందుకు ఉరికిరావెందుకు..నీ కాళ్ళు
చేతులు చచ్చుబడిపోయయా..బానిసత్వానికే తల ఊపుతున్నావు..మద్యం మత్తులో మంచిగానే ఊగుతునావ్వు..
ఆవినితీ నేతలకు కొమ్ముకాస్తూ..ఇంకా ఎంత కాలం ఊడిగం చేస్తావ్..స్వార్థం అనే సంకెళ్ల గబ్బులో ఇంకా ఎన్నాళ్ళు
ఉబ్బితబ్బి పొతావ్..బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలను తాకట్టుపెట్టి నీ కడుపు నింపుకుంటే
సరిపోతుందా..సిగ్గనిపిస్తాలేదా..అధికార ముసుగులో
పేదల జీవితాలు బుగ్గిపాలు చేస్తుంటే..ఎదురు తిరిగి ఆడగలేని నువ్వు ఏం సాధిద్దామని ఇంకా నెలపైన తిరుగుతున్నావ్
- ఎస్.కే.యాకూబ్ పాషా