ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.అదేవిధంగా కొన్ని షరతులు సైతం విధించింది.పాస్పోర్ట్ అప్పగించాలని,సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయకూడదని తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఈడీ సైతం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది.అప్పటి నుండి సుమారుగా 17 నెలల పాటు అయిన జైలులోనే ఉన్నారు.తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మనీష్ సిసోడియా కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.ఈరోజు సాయింత్రం మనీష్ సిసోడియా జైల్ నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.