ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.గురువారం బీఎన్.ఈ.ఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ,ఎలక్ట్రిక్,సీఎన్జీ వాహనాలను వినియోగదారులు సొంతంగా ఎంచుకుంటున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ఈవీ వాహనాల తయారీదారులు ఇక నుండి ప్రభుత్వ రాయితీలు కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు.