బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఢాకాలోని 32 పోలీసు స్టేషన్‌ల చీఫ్‌లు,18 మంది ఇతర ఇన్‌చార్జ్ అధికారులను బదిలీ చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది.బదిలీకి సంబంధించిన ఆర్డర్ ఆదివారం అర్ధరాత్రి వచ్చినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.తాజా బదిలీతో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల పరిధిలోని మొత్తం 50 పోలీస్ స్టేషన్ల హెడ్‌లు బదిలీ అయ్యారు.మిగిలిన 18 మంది అధికారులను ఆగస్టు 13న బదిలీ చేశారు.నివేదిక ప్రకారం బదిలీ అయిన వారికి చీఫ్‌లుగా చేసిన ‘కమాండ్ పవర్’ ఇకపై ఉండదు.వారిని దేశవ్యాప్తంగా ఉన్న శిక్షణా కేంద్రాలకు పంపించి అక్కడ పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చే బాధ్యతను అప్పగించారు. మరికొందరు టూరిస్ట్ పోలీస్,ఆర్మ్డ్ పోలీస్ బెటాలియన్ లేదా ఇండస్ట్రియల్ పోలీసులకు బదిలీ చేయబడ్డారు.