Friday, February 21, 2025
spot_img

దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు

Must Read
  • పురపాలక శాఖ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్‌ ఇన్‌ స్పెక్షన్‌
  • రహేజా మైండ్‌స్పేస్‌లో భవన నిర్మాణ, గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అవసరాలకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు

దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్‌ ఆదేశాల మేరకు.. చెరువు పరిసరాలను జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి, ఈడీ మయాంక్‌ మిట్టల్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, లేక్స్‌, రెవెన్యూ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు. చెరువులో మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్‌ ఇన్‌ స్పెక్షన్‌ నిర్వహించారు. రహేజా మైండ్‌ స్పేస్‌ ప్రాంతాల్లో భవన నిర్మాణ, గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు.

తీసుకునే చర్యలివే..
మాదాపూర్‌, సైలెంట్‌ వాలీ ప్రాంతాలు, క్యాచ్‌ మెంట్‌ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగునీటిని.. జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల (5 & 7 ఎమ్మెల్డీలు) ద్వారా శుద్ధి చేస్తున్నారు. దుర్గం చెరువు భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు, చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలి పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా 1000 ఎంఎం డయా పైపులైన్‌ ను మాదాపూర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి మాదాపూర్‌ ఐడడి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. టెండర్‌ ఖరారయ్యాక.. వచ్చే 3 నెలల్లో పైపులైన్‌ నిర్మాణ పనుల్ని పూర్తి చేయనున్నారు. దీని వల్ల లేక్‌ పార్కులో జరుగుతున్న సీవరేజ్‌ ఓవర్‌ ఫ్లో కూడా తగ్గనుంది. వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్‌ డ్రైయిన్‌ సైతం నిర్మించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఈ నిర్మాణ పనుల్ని చేపట్టి, 3 నెలల్లో పూర్తి చేయనుంది. దుర్గం చెరువు చుట్టు పక్కల నివాసాల నుంచి వచ్చే సిల్ట్‌ డైవర్షన్‌ మెయిన్‌ లో కలకుండా.. సిల్ట్‌ ఛాంబర్లు నిర్మించుకోవాలని వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. లేక్‌ చుట్టుపక్కల ఉన్న డైవర్షన్‌ మెయిన్‌ మ్యాన్‌ హోళ్లను పరిశీలించాలని రహేజా గ్రూప్‌ సంస్థను ఆదేశించారు. లేక్‌ లో సీఎస్‌ఆర్‌, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టినప్పుడు మ్యాన్‌ హెళ్ల ఎత్తు తగ్గడం కానీ, ధ్వంసం కావడం కానీ లాంటివి జరిగితే గుర్తించి, వాటికి మరమ్మతులు చేసి జలమండలి అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డుకు సమాంతరంగా చేయాలని ఆదేశించారు. అలాగే ఒకవేళ డైవర్షన్‌ మెయిన్‌ చోకేజీ అయితే డీ-సిల్టింగ్‌ చేయడానికి వీలుగా ప్రతి నాలుగో మ్యాన్‌ హెళ్‌ ను రోడ్డుకు సమాంతరంగా నిర్మించి సేఫ్టీ గ్రిల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

చెరువు భూగర్భ జలాల స్థాయుల్ని కాపాడేందుకుఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని పార్కులో నిర్వహణ పనులకు, చెట్లు పెంచేందుకు ఉపయోగించాలని సూచి ంచారు. రహేజా మైండ్‌ స్పేస్‌ ప్రాంతాల్లో భవన నిర్మాణ, పార్కు, ల్యాండ్‌ స్కేప్‌ నిర్వహణకు ఇతర అవసరాలకు తప్పనిసరిగా వంద శాతం రీసైకిల్‌ వాటర్‌ నే వినియోగించాలని ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు. అందుకోసం వారం లోపల దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ప్రత్యేక పైపు లైన్‌ ను నిర్మిం చాలని ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ట్రీటెడ్‌ వాటర్‌ తరలించి వాడుకు నేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతం లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ అధీనంలో ఉన్న పార్కులు, ల్యాండ్‌ స్కేపింగ్‌ లల్లో రీసైకిల్‌ నీటినే వాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జలమండలి ప్రాజెక్టు సీజీఎం పద్మజ, ఓఎస్డీ సత్యలింగం, జీహెచ్‌ ంఎసీ జడ్సీ ఉపేందర్‌ రెడ్డి, డీసీ ముకుంద్‌ రెడ్డి, ఈఈ దుర్గా ప్రసాద్‌, ఈఈ లేక్స్‌నారాయణ ఎలక్ట్రికల్‌ ఫిషరీస్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS