Friday, February 21, 2025
spot_img

ఆదాబ్‌ కథనానికి స్పందించిన మైనింగ్‌ అధికారులు..

Must Read
  • పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు..
  • మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్‌..
  • అలా ఎవరు చెప్పలేదు మైనింగ్‌ ఏఈ…
  • మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు..

పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్‌ తో పాటు మైనింగ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఇదే సమయంలో మైనింగ్‌ ఏడి ఆదేశాల మేరకు మైనింగ్‌ ఆర్‌ఐ సైదులు యాదవ్‌ మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వచ్చారు. ఇదే సందర్భంలో సింగూరు వైపు ఏపి 22 వై 7937, టి. టి ఎస్‌ యు ఏ 1823 నెంబర్‌ గల టిప్పర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పట్టుకున్నారు. అప్పటికే మట్టిని అక్రమం గా తరలి స్తున్న ప్రభుత్వ ఉద్యోగి జాంగీర్‌ కొడుకుతోపాటు సింగూర్‌ మాజీ ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, జర్నలిస్ట్‌ గా చెప్పుకునే శేఖర్‌ లు అక్కడికి చేరుకొని ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధిని ఇలా అధికారులకు పట్టిస్తే నీకు ఏమి వస్తుందంటూ నానా దుర్భాషలు ఆడారు. నీ అంతు చూస్తాం ఇక నుంచి ఎలా చేస్తావో మేము చూస్తాం గుద్దుకోవడానికైనా రెడీ అంటూ దూషించారు. అక్కడి నుంచి మైనింగ్‌ అధికారులతో మట్టిని తవ్వే ప్రదేశానికి వెళ్లగా ఒక టిప్పర్‌ తో పాటు జెసిబి ఉన్నప్పటికీ మైనింగ్‌ అధికారులు వాటిని పట్టుకోలేదు. ఇదిలా ఉంటే తమకు ఇరిగేషన్‌ శాఖ ఏఈ, తాహసిల్దార్‌లు మంత్రి చెప్పడంతో మట్టిని కొట్టుకోమన్నారని గ్రామాల చెందిన యువకులు మైనింగ్‌ అధికారులకు తెలిపారు. కానీ మైనింగ్‌ అధికారులు ఇరిగేషన్‌ శాఖ ఏఈ మైపాల్‌ తో మాట్లాడితే తాము మట్టిని బయటకు అమ్మవద్దని… మంత్రి కూడా మట్టిని కొట్టుకుపోవాలని ఎప్పుడు చెప్పలేదు అన్నారు. రెండు మూడు రోజులైనా తర్వాత అధికారులతో మట్టి అమ్మకుండా మట్టిని తీసుకొచ్చుకోవాలని కొద్దిరోజులు ఆగాలని మాత్రమే మంత్రి సూచించాడు అన్నారు. తాను మట్టిని ఎందుకు కొడుతున్నారని అడిగితే అధికారులు అనుమతి ఇచ్చారని… మంత్రి సైతం చెప్పాడు అంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు అన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ శాఖ అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు ఎవరు కూడా మట్టిని తరలించ వద్దని మైనింగ్‌ అధికారులు హెచ్చరించారు. పట్టుకున్న టిప్పర్లకు 2662 రూపాయలు చొప్పున7273 రూపాయల ఫైన్‌ వేసి వదిలేయడం జరిగిందన్నారు.

ఇంకొకసారి వార్త రాస్తే చంపేస్తాం….
మాకు మంత్రి చెప్పాడు.. మంత్రి చెప్తేనే మట్టిని కొట్టాం.. అది గ్రామానికి చెందిన చిరు వ్యాపారుల కోసం దానికి నీకేమైతుంది నువ్వెందుకు వార్త రాశావని… ఇక ముందు వార్త రాస్తే ఊరుకు నేది లేదని.. అవసరమైతే చంపేస్తాం ఏం చేస్తావో చేసుకో అంటూ సింగూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ తో పాటు ఎర్ర శేఖర్‌ బెదిరించాడు. ఈ సమయంలో మైనింగ్‌ శాఖ ఆర్‌ఐతో పాటు డ్రైవర్‌ సైతం అక్కడే ఉన్నాడు. వారి సమక్షంలోని బెదిరించడం వెనుక మంత్రి అండదండలు ఉన్నాయన్న భావనతో జర్నలిస్ట్‌ పై ఇట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి ఇలాంటి అక్రమ మట్టి దందా వ్యాపారులను ప్రోత్సహిం చకుండా నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS