Thursday, November 14, 2024
spot_img

మీకు ఇష్టమైతేనే వివరాలు చెప్పండి

Must Read
  • కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
  • కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించండి
  • ప్రభుత్వం పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్య
  • వేములవాడలో శ్రీరాజ రాజేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి
  • గోపూజ చేసి, కోడె మొక్కులు చెల్లించుకున్న పొన్నం

మీకు ఇష్టమైతేనే మీ పూర్తి వివరాలు చెప్పాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టేలా చేయట్లేదని, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైన సర్వే కాదని తెలిపారు. ప్రజలకు ఇష్టం ఉంటేనే కులం, ఆధార్ వివరాలు వెల్లడించవచ్చని, అందుకు అనుగుణంగానే ఎన్యూమరేటర్లు వివరాలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి గోపూజ చేసి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలను బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డు వివరాలు అడగట్లేదన్నారు. ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రభావితం కావొద్దని. మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మీ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చింది… భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నామన్నారు.

కులగణన సర్వే.. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సర్వే అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతున్న కేటీఆర్ కు అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేటీఆర్.. తమ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, ప్రతిపక్ష పదవి బీసీలకు, ఎస్సీలకు ఇస్తే.. బీసీల గురించి మాట్లాడే అర్హత పొందుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో బీసీలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జీఓ నంబర్ 18 ద్వారా.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సమాచారాన్ని సేకరించి, అసమానతల్ని తొలగించి అన్నివర్గాల వారికి సమాన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS