స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
మహాశివరాత్రి సందర్భంగా జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ఆలయంలోని భక్తులతో ముచ్చటించి.. అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో హెల్త్ చెకప్ చెపించుకున్నారు. దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వర స్వామి వారిని హుస్నాబాద్ ప్రాంతం వారే కాదు.. ఇతర జిల్లాల వారు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు ముందే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. 20 సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటు న్నానని అన్నారు. ఈసారి ఆరెపల్లి నుండి పందిల్ల వరకు వయా పొట్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు వేయించాం. భక్తులకు శాశ్వత డ్రింకింగ్ వాటర్ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతం అంతా ప్రాజెక్టులు పూర్తయి.. మంచి పంటలతో సుభిక్షంగా ఉంచాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.





