Thursday, November 21, 2024
spot_img

నిమ్స్ లో మొలచింత‌లప‌ల్లి బాధిత మహిళను పరామర్శించిన మంత్రి సీత‌క్క‌

Must Read
  • నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం
  • పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం
  • బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం
  • చెంచుల భూముల‌ను కాజేసే కుట్ర‌ను అడ్డుకుంటాం

మొల చింతలపల్లి చెంచు మ‌హిళ‌పై అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క స్ప‌ష్టం చేసారు. మ‌ధ్య‌యుగాల నాటి మ‌న‌స్త‌త్వంతో మాన‌వత్వాన్ని మ‌రిచి మనుషుల రూపంలో ఉన్న మృగాళ్లు జ‌రిపిన దాడిని ఉపేక్షించేది లేద‌న్నారు. అమ్మాయులు, మ‌హిళ‌ల‌పై అఘా యిత్యాల‌కు తెగ‌బ‌డే వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ ఇస్తుంద‌న్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క బుధ‌వారం నాడు ప‌ర‌మార్శించారు. బాధితురాలితో మాట్లాడి ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితురాలికి సీతక్క భ‌రోసానిచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యుల‌కు దైర్యం చెప్పారు. ఏ అవ‌స‌రం ఉన్నా త‌న‌కు కాల్ చేయాల‌ని చెప్పారు. నాగ‌ర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభ‌వ్ తో ఫోన్ లో మాట్లాడిన సీతక్క కేసు పురోగ‌తిని తెలుసుకున్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి సీతక్క ఎస్పీని ఆదేశించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సీత‌క్క.. మ‌ధ్య యుగాల నాటి మ‌న‌స్త‌త్వంతో చెంచు మ‌హిళ మీద అత్యంత దారుణంగా దాడి చేసార‌ని తెలిపారు. భాధిత మ‌హిళ ఇప్పుడిప్పుడే కొలుకుంటుంద‌న్నారు. దాడి ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఐటీడీఏ, మ‌హిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధితురాలికి అండ‌గా నిలిచార‌ని గుర్తు చేసారు. భాధితురాల‌ని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ త‌ర‌లించిన‌ట్లు తెలిపిన సీత‌క్క‌..బాధితురాలు పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి పంపిస్తామ‌న్నారు. బాదిత కుటుంబానికి పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌న్నారు. ఘ‌ట‌న‌లో పాలు పంచుకున్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నాగ‌ర‌కర్నూల్ ఎస్పీని ఆదేశించిన‌ట్లు తెలిపారు. బాధితురాలి మామ‌య్య నాగ‌య్య మ్రుతి ప‌ట్ల అనుమానాలున్నందున ఆ కేసును పున విచారించాల‌ని కోరారు.

మొల చింతలపల్లి దాడి ఘ‌ట‌న‌కు భూ వివాద‌మే కార‌ణ‌మ‌ని తాము భావిస్తున్న‌ట్లు సీత‌క్క తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో చెంచుల పునరావాసం కోసం కేటాయించిన భూముల‌పై క‌న్నేసిన కొంద‌రు ఇలాంటి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌న్న అనుమానం వ్య‌క్తం చేసారు. గ‌తంతో భూములు అమ్ముకున్న భూ యాజ‌మానుల‌కు ధ‌ర‌ణి త‌ర్వాత తిరిగి పాస్ పుస్త‌కాలు వ‌చ్చాయ‌ని.. వారే ఇప్పుడు చెంచుల మీద దాడులు చేస్తున్నారని సీత‌క్క వెల్ల‌డించారు. చెంచుల‌కు పంపిణి చేసిన భూముల విలువ పెరిగినందున‌..వారి పేద‌రికాన్ని, అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని వారి భూముల‌ను లాక్కునేందుకు దాడులు చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. మొల చింతలపల్లి చెంచు మ‌హిళ‌పై దాడి చేసిన వారిపై హ‌త్య య‌త్నం, ఎస్సీ ఎస్టీ అట్రోసిటిస్ నిరోధ‌క చ‌ట్టం కేసు న‌మోదు చేసామ‌న్నారు. బాధితురాలికి ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల ఆర్దిక స‌హ‌యాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. అమ్మాయిలు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డితే క‌ఠినంగా శిక్షించేలా పోలీసులకు పూర్తి స్వేచ్చ ఉంటుంద‌న్నారు. గంజాయి, డ్ర‌గ్స్ ను సంపూర్ణంగా నిర్మూలించేలా త‌మ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న సీతక్క‌..గంజ‌యి మ‌త్తులో నేరాల‌కు పాల్ప‌డితే క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వని హెచ్చ‌రించారు. మంత్రి సీత‌క్క‌తో పాటు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్ట‌ర్ డా. బీర‌ప్ప‌, మెడిక‌ల్ సుప‌రిండెంట్ డా. స‌త్య‌నారాయ‌ణ, నాగ‌ర్ క‌ర్నూల్ ఐటీడీఓ రోహిత్ త‌దిత‌రులున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS