Sunday, February 23, 2025
spot_img

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి

Must Read
  • స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం
  • బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం…
  • అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు
  • నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది
  • బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు…
  • పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు..
  • మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి నివాసానికి వెళ్లిన బండి సంజయ్
  • స్థానిక నేతలతో కలిసి అక్కడే భోజనం చేసిన సంజయ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా బీజేపీ బలపర్చిన అభ్యర్థుల విజయం తథ్యమని చెబుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(BANDI SANJAY KUMAR) చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే…. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా గెలిపించే బాధ్యత తీసుకుంటామని పునరుద్టాటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన్ గార్డెన్స్ లో బీజేపీ పచ్చీస్ ప్రభారీ (25 మిం ఓటర్లకు ఒక ఇంచార్జ్)ల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కాశీపేట లింగయ్య, గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, బీజేపీ టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలని లక్షలాది మంది కార్యకర్తలు కల కంటున్నారని, ఎంతో మంది ఆ కల నెరవేరకుండానే చనిపోయారని చెప్పారు. ఈసారి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే ఉందన్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, కాశీపేట లింగయ్య, కోమాల అంజనేయులు వంటి వారిని చంపాలని నక్సలైట్లు పెద్ద పోస్టర్లు కూడా వేశారని గుర్తు చేశారు. అయినా భయపడకుండా నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడి కాషాయ జెండాను రెపరెపలాడించారని చెప్పారు.

బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ‘‘మనకు గోత్రం, జన్మ నామం, జన్మ నక్షత్రం ఉంటుంది. మొల దారం కట్టుకుంటాం. మన సంప్రదాయాలు వేరు.. మరి హిందువుల జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారు? ఒకవైపు బీసీ జనాభాను తగ్గించి చూపుతున్నారు. ఇంకోవైపు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్ప అందులో 10 శాతం ముస్లింలకే ఇస్తున్నారు.. బీసీలకు ద్రోహం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటాం. అందుకే బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బిల్లు పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. వెనక్కు తిరిగి పంపుతాం. ముస్లింలను మినహాయించిన తరువాతే బీసీ బిల్లును ఆమోదిస్తాం…

సమావేశానంతరం గుజ్జల రామక్రిష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పెద్దపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులతోపాటు స్థానిక నాయకులతో కలిసి బండి సంజయ్ భోజనం చేశారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS