- ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
- ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
- ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
- భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
- పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
- పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతర సభ్యులు మోడీను బలపరిచారు.దింతో లోక్ సభ ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచినా నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.తన పైన నమ్మకం ఉంచి నాయకత్వ బాధ్యతను అప్పగించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.భారత దేశానికి ఎన్డీఏ ఆత్మలాటిందని, ఎన్నికల ముందే కూటమి ఘన విజయం సాధించిందని ఇది ఒక చరిత్ర అని మోడీ పేర్కొన్నారు.22 రాష్ట్రాల్లో తమ కూటమి ఉందని విశ్వాసం అనే బంధం తమను ఏకతాటిపైకి తీసుకొనివచ్చిందని అన్నారు. ప్రభుత్వం నడపడానికి అందరి సహకారం కావాలని మోడీ కోరారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పై మాట్లాడిన నరేంద్ర మోడీ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మకమైన విజయం సాధించామని చంద్రబాబు నాయుడు తనతో చెప్పినట్టు ఈ సందర్బంగా మోడీ గుర్తుచేశారు.చంద్రబాబునాయుడు,పవన్ పై మోడీ ప్రసంశల వర్షం కురిపించారు.” పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్” అని మోడీ అన్నారు, పవన్ వల్లే ఆంధ్రప్రదేశ్ లో కూటమికు భారీ విజయం లభించిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు.తెలంగాణ,కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వలు ఉన్నాయని,ఆ ప్రభుత్వాలు త్వరలో ప్రజల విశ్వాసం కోల్పోయాయి అని మోడీ విమర్శించారు.దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా మోడీ హామి ఇచ్చారు.