- స్థానిక సంస్థల ఎన్నికల తోనే మన రాజ్యాధికారానికి నాంది
- ఊరుకు పదిమంది కలిసిరండి ..రాజ్యాధికారం ఎలా రాదో చూద్దాం
- పేరు చివరన ఓటర్ నమోదులో ముదిరాజ్ అని గర్వంగా పెట్టుకోండి
- మనమంతా కలిసే ఉన్నాం..కలిసే నడుద్దాం..కలిసే పోరాడుదాం..
- మన కోసం కాకపోయిన మన భవిష్యత్తు తరాలకోసమైన ఉద్యమిద్దాం..
- అఖిల భారత ముదిరాజ్ మహాసభ
-ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ పిలుపు
గతంలో జరిగిందేదో జరిగి పోయింది…ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలి.మనలో చైతన్యం ఉంది…ఐక్యత ఉంది..కలిసి కట్టుగా కొనసాగగలమనే నమ్మకమే ఇంకా రావడం లేదు,ఎందుకో అర్ధం కావడంలేదు..ప్రశ్నలెన్నో జవాబు మాత్రం ఒక్కటే మనమంతా కలిసే ఉన్నాం..కలిసే నడుద్దాం..కలిసే పోరాడుదాం..మన కోసం కాకపోయిన మన భవిష్యత్తు తరాల కోసమైన కలిసి ఒక్కటిగా ఉద్యమిద్దాం..మనలో నివురుగప్పిన నిప్పులా మారిన చైతన్యాన్ని నిదురలేపేందుకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ పేర్కొన్నారు..మంగళవారం జిల్లా కేంద్రంలోని కాళికాంబ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల సమావేశానికి కాసాని వీరేశ్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరుకు పదిమంది చైతన్యవంతులను తయారు చేయాలని, రాజ్యాధికారం ఎలా రాదో చూద్దామని కాసాని వీరేష్ పేర్కొన్నారు.ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా సంఘం నిర్మాణంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాధికారం వంటి అంశాలపై మనమంతా దృష్టి పెట్టాలి :
ముదిరాజుల ఆలోచనలను, సోషల్ మీడియా పోకడలను ఎప్పటి కపుడు అంచనా వేసి అందుకు అనుగుణంగా సంఘాన్ని బలోపే తం చేసుకోవడంతో పాటు ముదిరాజుల హక్కుల సాధన, ఆర్థిక చైతన్యం,రాజ్యాధికారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కాసాని వీరేశ్ పిలుపునిచ్చారు.మనకు రాజకీయ పార్టీ లు ముఖ్యం కాదని,అంతిమంగా కులమే ముఖ్యమని వీరేశ్ స్పష్టం చేశారు. ముదిరాజుల్లో చైతన్యం,ఐక్యత ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరమైపోయి రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కులానికి జరుగుతున్న అన్యాయంపై ద్రుష్టి సారించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. దీన్ని అధిగమించేందుకు ఎలా ముందుకు పోవాలనే దానిపై తీవ్రంగా అన్వేషించడం జరిగిందని అన్నారు.
మన కోసం కాకపోయిన
మన భవిష్యత్తు తరాలకోసమైన ఉద్యమిద్దాం.. :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ లోనూ అతి తక్కువ జనాభా ఉన్న కులమే 40 కి పైగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటూ చట్టసభల్లో అడుగుపెడుతున్నారని వీరేశ్ అన్నారు. మారుతున్న జనరేషన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా సంఘం ఆలోచనలు కూడా మారాలనే పంతాలో అన్ని జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజులు జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజ్యాంగ ఫలితాలు అనుభవించకపోవడానికి కారణాలను వీరేశ్ ఈ సందర్భంగా వివరించారు. రాజకీయంగా ఆర్థికంగా ముదిరాజులు ఎదగాలంటే కచ్చితంగా ఓటర్ లిస్టులో పేరు చివరన ముదిరాజ్ ట్యాగ్ లైన్ కచ్చితంగా మార్పు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఓటర్ లిస్టు ఆధారంగానే రాజకీయాలు నడుస్తున్నాయని, తద్వారానే ఆయా కులాలకు మేలు జరుగుతుందని అన్నారు.
పేరు చివరన ఓటర్ నమోదులో
ముదిరాజ్ అని గర్వంగా పెట్టుకోండి:
ప్రతి ముదిరాజ్ తప్పనిసరిగా ఓటర్ లిస్టులో ముదిరాజ్ ట్యాగ్ లైన్ పెట్టుకోవాలని వీరేశ్ సూచించారు. అప్పుడే మనం ఎంతో.. మనకు ఎంత కేటాయిస్తున్నారు… రాజకీయపరంగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు అనే దానిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చట్టసభల్లో ముదిరాజులకు రిజర్వేషన్లు రావాలంటే ఖచ్చితంగా ముదిరాజులు ఓటర్ లిస్టులో మార్పు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ముదిరాజులకు రాజ్యాధికారం ఎందుకు రాదో ఇకనుంచి చూద్దామని అన్నారు , తాను రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను రాష్ట్రంలో గెలిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజులు రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రామ్ శ్రీనివాస్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.