Friday, November 22, 2024
spot_img

కబ్జా భూమిలోనే.. ‘ఎన్‌’కన్వెన్షన్‌ సెంటర్‌..!

Must Read
  • తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి
  • రెండు ఎకరాలు బఫర్‌జోన్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఉన్నట్లు గుర్తింపు
  • నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
  • వంట గది, స్టోర్‌ రూమ్‌లు నిర్మించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ
  • నేటికి చర్యలు తీసుకోని ఇరిగేషన్‌ అధికారులు
  • తొలుత 29ఎకరాల చెరువుకుగాను ప్రస్తుతం 10 ఎకరాలే
  • సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువు రాను రాను అంతా కబ్జాకు గురవుతుంది. ప్రభుత్వాలు మారిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యమేంటి. నాడు 29 ఎకరాలతో ఉన్న తుమ్మడికుంట చెరువు శిఖం నేడు 10 ఎకరాలు కూడా కానరాకపోవడం గమనార్హం. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ చెరువు పరిసరాల్లో ఆక్రమణలకు పాల్పడింది. ఇప్పటికే సర్వే నిర్వహించి.. మూడు ఎకరాలకు పైగా చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ కట్టినట్టు తెలు స్తోంది. గతంలో గవర్నమెంట్ ఆఫీసర్లు సర్వే చేసి కబ్జా భూమిని గుర్తించి ఆ మేరకు కట్టడాలకు ఎరుపు రంగులో మార్కింగ్ చేశారు. అక్రమ నిర్మాణమంటూ గోడలపై ముద్రలు కూడా వేశారు. కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేసిన యాజమాన్యానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది.

వంట గది, స్టోర్ రూమ్లు చెరువు భూమిలోనే :
తుమ్మిడికుంట చెరువు స్థలం కబ్జా చేసి ఆ భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టినట్లు అధికారులే తేల్చారు. అప్పట్లో కొందరూ దీనిపై ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసరాలను రెవెన్యూ అధికారులు సర్వే నిపుణుల చేత రీ సర్వే చేయించారు. కాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడికుంట చెరువు స్థలంలో ఒక ఎకరం, అలాగే రెండు ఎకరాలు బఫర్ ఏరియా కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వంట గది, స్టోర్ రూమ్లు నిర్మించి ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

ఇదీలా ఉంటే తనిఖీల జరిగినప్పుడు మీడియాను అనుమతిం చక పోవడంతో విమర్శలు వెల్లువెత్తా యి. అయితే ఎన్ కన్వెన్ష న్లో కి మీడియా అనుమతిని అధికారులు నిరాకరించారు. మరోవ్కెపు తమ్మి డికుంట చెరువును ఆక్రమించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవు తోంది. గతంలో గురుకుల్ ట్రస్ట్ భవన్లోని అక్రమ కట్టడాలను కూల్చి వేసిన జీహెచ్ఎంసీ అధికా రులు అదే తుమ్మిడికుంట చెరువుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మినమేషాలు లెక్కిస్తున్న ఇరిగేషన్ అధికారులు:
గత ప్రభుత్వ హయాంలో హడావుడిగా సర్వే చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మూడు ఎకరాలు చెరువు పరిసరాలను కబ్జాచేసినట్లు తేల్చారు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేదలు గుడిసెలు వేసుకుంటే వెంటనే వెళ్లి కూల్చివేసే ఇరిగేషన్ అధికారులు చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న మీనమేషాలు లెక్కిస్తున్నారు. బలిసినోళ్లు అని చెప్పి వేల కోట్ల ప్రాపర్టీని అధికార యంత్రాంగం రక్షించకపోవడం గమనార్హం. అయితే దీంట్లో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనా అన్యాక్రాంతం అవుతున్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS