మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోరంగా పరాజయం చెందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు నానా పటోలే కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ పదవికి అయిన రాజీనామా చేశారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామ పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గాను 233 స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది.కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.