Wednesday, April 16, 2025
spot_img

డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు

Must Read

హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదర‌బాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన వ్యాఖ్యాత గాయకులు ఉపాధ్యాయులు డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులను సాంస్కృతిక, విద్యా, సామాజిక రంగాలలో సేవలు అందచేసినందుకు గాను సావిత్రీ బాయ్ పులే ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం చేసి సత్కరించింది. ఈ కార్యక్రమంలో అతిధులుగా కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ ఫిలీం చాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, సినీనటులు మాణీక్ రావు, సరస్వతి ఉపాసకులు జ్యోతిష్య రత్న దైవఙ‌ శర్మ, కార్యక్రమ నిర్వాహకులు దైద అనిత వెంకన్న తదితరులు శ్రీధరాచార్యులను అవార్డుతో సత్కరించారు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2023 తో పాటు నారా చంద్ర బాబునాయుడు, అక్కినేని నాగేశ్వర రావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, హిరో సుమన్, కోదండ రాం చేతుల మీదుగా అవార్డులు సత్కరాలు పొందిన శ్రీధరాచార్యులను రెండు వందలకు పైగా సంస్థలు సన్మానించాయి. గుజరాత్ లోని సూరత్ లో, కర్ణాటక లోని బెంగళూరు, మహరాష్ట్ర, ఢీల్లి తదితర ప్రాంతాల లోని తెలుగు వారిని తన మాటతో పాటతో అలరించారు.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS