- టీఎస్ ట్రాన్స్-కో కు 50లక్షల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
- మృగవాణి జాతీయ ఉద్యానవనంలో క్వాడ్ టవర్స్ ఏర్పాటు.
- ప్రాజెక్టు పనుల కోసం సుమారుగా 1800 పైగా చెట్ల నరికివేత..? అనుమతి ఇచ్చిందెవరు..?
- జింకల ప్రాణాలకు ముప్పు.. అధికారుల నిర్లక్ష్యం , 80 హెక్టర్ల మేర నష్టం
- ఇంత జరిగిన ప్రభుత్వ స్పందన ఏది.. ఆందోళన చెందుతున్న జంతుప్రేమికులు..
కోర్టు ఆదేశాలతో నగర పర్యావరణవేత్తలు,జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. వన్యప్రాణులను , అటవీ సంపదను కాపాడండని వేడుకుంటున్నారు. ట్రాన్స్-కో అధికారులు ఏర్పాటు చేసిన క్వాడ్ టవర్లతో “మృగవాణి జాతీయ ఉద్యానవనంలో ” ఉన్న జింకలకు ప్రమాదం పొంచివుందని మరోవైపు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యానవనంలో 80 హెక్టర్ల నష్టం కలిగిందని పర్యావరణవేత్తలు , జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
కేతిరెడ్డిపల్లి-రాయదుర్గం ట్రాన్స్ మిషన్ లైన్ ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ( టీ.ఎస్.పి.ఎ ) క్రాసింగ్ వద్ద టీఎస్ -ట్రాన్స్ కో అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఓఆర్ఆర్ తో పాటు అటవీ ప్రాంతం అంతటా మెనోపోల్స్ కు బదులుగా ఐదు క్వాడ్ టవర్లను ఏర్పాటు చేశారని నగర పర్యావరణవేత్తలు డాక్టర్ దొంతి నరసింహ రెడ్డి, న్యాయవాది శ్రీ మహేష్ మామిండ్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసును దాఖలు చేసారు. కేసు నెంబర్ : 82/2021. అయితే ఈ ప్రాంతంలో మృగవాణి జాతీయ ఉద్యనవనం ఉండడంతో జింకల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వాపోతున్నారు నగర పర్యావరణవేత్తలు. మెనోపోల్స్ కు బదులుగా హై టెన్షన్ క్వాడ్ టవర్లు ఏర్పాటు చేసి గెజిట్-ఆమోదిత ప్రణాళిక నుండి తప్పుకున్నందుకు టీఎస్-ట్రాన్స్-కో కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( సదరన్ జోన్ ) చెన్నై బెంచ్ రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది.కోర్టు ఆదేశాల ప్రకారం ఈ పెనాల్టీ మొత్తాన్ని చిలుకూరు రిజర్వడ్ ఫారెస్ట్ ప్రాంతంలోని మృగవాణి జాతీయ ఉద్యానవనం మరియు చెట్ల కవర్ అభివృద్ధికి ఉపయోగించాలని కోర్టు సూచించింది. టీఎస్ ట్రాన్స్-కో ఈ విషయం లో దోషిగా ఉన్నప్పటికీ విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా ఉండటానికి అనుమతి లేని క్వాడ్ టవర్లను మార్చడం కోసం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. అయితే తాజాగా ఈ ఆదేశాలను కోర్టు వెనక్కు తీసుకుంది.అయితే మృగావాణి నేషనల్ పార్క్ ప్రాంతం అధికార గెజిట్ ప్రకారం అటవీశాఖ 360 హెక్టార్లు నోటిఫై చేయలేదని కేవలం 287 హెక్టర్లే నోటిఫై చేశారంటూ విచారణ సందర్భగా కోర్టు అంగీకరించింది.ఈ పొరపాటు 2011లో జరిగిన అటవీశాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.సర్వే చేసినట్టు అటవీశాఖ రికార్డ్స్ లో నమోదు కాలేదని కోర్టు తెలిపింది.2023లో కోర్టు ఆదేశాలతో మృగవాణి నేషనల్ పార్క్ సరిహద్దు ప్రాంతంలో తాజాగా సర్వే నిర్వహించారు.సర్వే ప్రకారం అక్కడున్న విస్తీర్ణం కేవలం 280.29 అని కోర్టు అంగీకరించింది.మృగవాణి నేషనల్ పార్క్ పరిసరాల్లో హిమాయత్ నగర్ , ఉస్మాన్ సాగర్ లాంటి సున్నితామైన పర్యావరణ ప్రాంతాలు కావడం,ఉద్యానవనంకు 80 హెక్టర్లు మేర నష్టం వచ్చిందని వాపోయారు.పర్యావరణవేత్తలు.
అటవీ జంతువుల రక్షణలో జాతీయఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని,జరిగిన నష్టం పై జాతీయ వన్యప్రాణుల బోర్డు కోర్టును ఒప్పించడం చాల అవసరం ఉందని తెలిపారు. అయితే సరిహద్దును ఏర్పాటు చేయడానికి ఎలాంటి సర్వే నిర్వహించకపోవడం వల్ల నగరంలో మహావీర్ హరిణ వనస్థలి , ఇతర జాతీయ పార్కులకు కూడా ప్రమాదం పొంచివుందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు అటవీ జంతువుల రక్షణలో కిలక పాత్ర పోషిస్తాయి.దింతో జరిగిన నష్టం పై జాతీయ వన్యప్రాణుల బోర్డు కోర్టును ఒప్పించడం అత్యంత అవసరమైన అంశంగా కనిపిస్తుంది. సరిహద్దును ఏర్పాటు చేయడానికి ఎలాంటి సర్వే నిర్వహించకపోవడం వల్ల నగరంలో మహావీర్ హరిణ వనస్థలి , ఇతర జాతీయ పార్క్ లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నగర పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
అధికారులకు పర్యావరణ , జంతువుల రక్షణ పై పట్టింపు లేదా..??
అటవీ సంపదను రక్షించాల్సిన అటవీ అధికారులే ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు. ట్రాన్స్ కో అధికారులు మెనోపోల్స్ కు బదులుగా క్వాడ్ టవర్లకు ఎందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు పర్యావరణ, జంతు ప్రేమికులు. జింకల ప్రాణాలు రక్షించడంలో , అటవీ సంపాదనను కాపాడడంలో అధికారులు విఫలం అయ్యరని ఆరోపిస్తున్నారు. అధికారులకు పట్టింపు ఉంటె జాతీయ ఉద్యానవనంకు సంభందించి 80 హెక్టార్ల భూమి ఎలా మైయమైందని , ఇంత జరిగిన పై స్థాయి అధికారులు , ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహించిందన్న ప్రశ్నలు రేకేర్తిస్తున్నాయి..
1800 పైగా చెట్ల నరికివేతకు పర్మిషన్ ఇచ్చిందెవరు..??
చెట్లు ప్రగతికి మెట్లు..చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇది ప్రభుత్వం మాత్రమే కాదు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణ ప్రియులు చెప్పే విషయం. అయితే క్వాడ్ టవర్స్ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారుగా 1800 పైగా చెట్లను నరికివేసినట్టు తెలుస్తుంది. పర్యావరాణన్ని కాపాడే చెట్లను ఇంట పెద్ద మొత్తం నరికివేస్తుంటే ప్రభుత్వం , సంభందిత మంత్రి , పై స్థాయి అధికారులు ఎందుకు మౌనంగా వహించారు..అసలు ఇంట పెద్ద మొత్తంలో చెట్లను నరికివేయడానికి గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా..?? సంభందిత మంత్రికు ఈ విషయం తెల్వదా అనే ప్రశ్నలు కూడా కలుగుతున్నాయి..
ఏదిఏమైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల మృగవాణి జాతీయ ఉద్యానవనకి , అక్కడున్న జింకలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం , అధికారులు ఈ విషయం పై స్పందించి ఈ ప్రాజెక్టు చేపట్టిన సంస్థ పైన , నిర్లక్శ్యం వహించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు , నగర పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.