మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్ గా శ్రీధన్ దర్శకత్వంలో ఎ.కె. టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్. నిర్మించే నూతన చిత్రం చిత్రీకరణ మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది. టైటిల్ నిర్ణయించాల్సిన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టి కుమార్ క్లాప్ నిచ్చిన అనంతరం మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కు తరలి రావాలని, షూటింగులు ఆంధ్ర ప్రదేశ్ లో చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆకాంక్షించారో అందుకు అనుగుణంగా చిన్న సినిమా నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ కు తరలివచ్చి, షూటింగు లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా వచ్చిన నిర్మాతలకు సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా?. తెలియజేయాలని కోరుతున్నాను. టూరిజం లొకేషన్స్ ను మరింతగా అభివృద్ధి చేయాలి. పాడేరు, అరకు, విశాఖ వంటి తదితర లొకేషన్స్ లో షూటింగ్ లకు అనువైన లొకేషన్స్ ను గుర్తించి, వాటి అభివృద్ధితో పాటు నిర్మాతలకు అక్కడ షూటింగులు చేసుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ కింద త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాను.