మరో కొత్త వ్యాధి జపాన్ ప్రజలను వెంటాడుతుంది.స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధితో జపాన్ ప్రజలు సతమతమవుతున్నారు.ఈ వ్యాధి సోకితే 48 గంటల్లో మనిషి చనిపోతాడాని వైద్యులు పేర్కొన్నారు.జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.మాంసాన్ని తినే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు,వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం ఈ వ్యాధి జపాన్ లో వేగంగా వ్యాపిస్తుంది.ఈ వైరస్ పై ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వైరస్ బారిన పడితే 48 గంటల్లోనే మరణిస్తారని,ఈ వ్యాధి సోకితే ఆ రోగి పాదంలో వాపు వస్తుందని,అది మోకాలి వరకు వ్యాపిస్తుందని తెలిపారు.ప్రజలు పరిశుభ్రత పాటించాలని,చిన్న గాయం తగిలిన చికిత్స చేయించుకోవాలని తెలిపారు.