- నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్
- గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ మేరకు బుధవారం డీజీపీ జితేందర్ నియామక పత్రం అందించారు.నిఖత్ జరీన్ రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం,ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని కూడా సాధించింది.పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొంది.డీఎస్పీ పత్రాన్ని అందుకున్న నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ ఉంటుంది.గత నెల 01న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు సవరణ చేసి స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం హోంశాఖను ఆదేశించింది.