- మెల్‌బోర్న్ టెస్ట్‌లో రికార్డు శతకం
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్టేల్రియా పర్యటనలో అదరగొట్టాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు మెల్‌బోర్న్ టెస్టులో జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈక్రమంలో టెస్టు కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ తొలి బంతి నుంచి నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్టేల్రియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు దానిని అధిగమించాడు. సుందర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన నితీశ్ సెంచరీ సమయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను భారత్ కోల్పోయింది. చివరి వికెట్‌గా సిరాజ్ మాత్రమే ఉన్నాడు. అప్పుడు నాన్‌స్టైక్రింగ్ ఎండ్‌లో నితీశ్ 99 పరుగుల విూద ఉండటం.. కమిన్స్, బోలాండ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో అభిమానుల్లో ఆందోళన రేగింది. అయితే, సిరాజ్ చక్కటి డిఫెన్స్‌తో ఆడి నితీశ్‌కు స్టైక్రింగ్ ఇచ్చాడు. బోలాండ్ బౌలింగ్‌లో బౌండరీతో సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ప్రేక్షకుల్లో ఉన్న నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డిని అభినందిస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. నితీశ్‌తోపాటు సుందర్ (50) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన అతడు హాఫ్ సెంచరీ సాధించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన సుందర్ 146 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అతడి కెరీర్‌లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. సెంచరీ హీరో నితీశ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు శతకం (127 పరుగులు) భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. నితీశ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాడ్‌లైటింగ్ కారణంగా ఆట నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 358/9. క్రీజ్‌లో నితీశ్ (105?), సిరాజ్ (2) ఉన్నారు. ఇంకా భారత్ 116 పరుగులు వెనకబడి ఉంది. అయితే, వర్షం వచ్చేయడంతో పిచ్‌ను కవర్లతో సిబ్బంది కప్పేశారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసింది. ఇవాళ భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి 193 పరుగులు రాబట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.