కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354ఏ కింద కేసు నమోదు చేశారు.ఓ పని నిమిత్తం యడ్యూరప్ప ఇంటికి వెళ్తే తమతో యడ్యూరప్ప అనుచితంగా ప్రవర్తించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోని సీ.ఐ.డికి అప్పగించింది.యడ్యూరప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని సీ.ఐ.డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు