విశ్వ కధంబంలో వెలుగులను నింపిన వీరుడు పంట పొలాలకై తన జీవితాన్ని సమర్పించిన మహనీయుడు. ప్రపంచ ప్రజల ఆహార సమస్యకు పరిష్కార మార్గం చూపిన మహానుభావుడు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ఆఫ్రికా మెక్సికో ప్రజల ఆకలి తీర్చిన అన్నదాత నార్మన్ బోర్లాగ్. భూమి తల్లి బిడ్డల కష్టాలను కరువును తరిమికొట్టి, కష్టజీవుల కడుపు నింపే, పంటల ఉత్పత్తికై హరిత విప్లవాన్ని ఆరంభించిన వ్యవసాయ అభ్యుదయవాది 1914 మార్చి 25న అమెరికాలోని అయోలాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తన తల్లిదండ్రులకు ఉన్న 16 ఎకరాల పొలంలో ఏడు సంవత్సరాల నుండి 9 సంవత్సరాలు వయసు వచ్చేంతవరకు, పొలం పనులు చేయటం చేపలు పట్టడం కోళ్లు పశువులతో కాలక్షేపం చేయటం పాటలు పాటలతో తన జీవితాన్ని గడిపి, తన తాతగారి ప్రోత్సాహంతో చదువును కొనసాగించి మిన్స్ సోట విశ్వవిద్యాలయం నుంచి పాతవిక శాస్త్రంలో పట్టా పొంది ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూ, అదే విశ్వవిద్యాలయం నుంచి జన్యు శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆ తర్వాత గోధుమ పంటపై అనేక రకాలైన పరిశోధనలు చేసి చీడపురుగుల నుండి గోధుమ పంటను రక్షించి పంట దిగుబడితే ఎంతో కృషి చేశారు. 1960వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ లాంటి దేశాలని కరువు నుండి కాపాడటలో గోధుమ పంట దిగుబడి ఎంతో తోడ్పడింది.
1960 నుండి 1990 వరకు భారత్ పాకిస్తాన్ ఆఫ్రికా ఆసియా దేశాలలో కరువు కాటకాలను నిర్మూలించి అర్ధ విప్లవానికి పునాది వేసిన మహనీయుడు.ఈ హరిత విప్లవ కారణంగా ప్రపంచంలో అనేక దేశాలు కరువును ఎదుర్కోగలిగాయి వందల కోట్ల మంది ప్రజానీకానికి కావలసిన ఆహార ధాన్యాల దిగుబడిలో తనదైన కృషి చేశారు.మనం నేడు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నామంటే దానికి కారణం అనేకం.వాటిలో కృషి చేసిన వారిలో ప్రముఖుడు నార్మన్ బోర్లాగ్.ఆయనను హరిత విప్లవ పితామహుడు అని అంటారు. ఆయన చేసిన కృషి మానవాళికి అందించిన గొప్ప వరాలలో ఒకటి. 20వ శతాబ్దంలో ప్రపంచం ఆహార కొరతతో అల్లాడింది.కోట్లాది మంది ప్రజలు ఆకలితో వేదన పడ్డారు.ఈ పరిస్థితులను చూసి బోర్లాగ్ ఆందోళన చెందారు. ఆయన తన జీవితాన్ని కృషికి అంకితం చేశారు.అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ రకాలను కనుక్కునేందుకు అనేక ప్రయోగాలు చేశారు.ఆయన కృషి ఫలితంగా అనేక దేశాలు ఆహార సమస్య నుండి బయటపడ్డాయి.
భారతదేశంలో బోర్లాగ్ ప్రభావం భారతదేశం కూడా ఆహార కొరతతో అల్లాడుతున్న సమయంలో బోర్లాగ్ ఇక్కడకు వచ్చి తన పరిశోధనలను చేపట్టారు. ఆయన సలహాల మేరకు భారత ప్రభుత్వం అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ రకాలను పండిస్తూ ఆహార ఉత్పత్తిని పెంచింది. దీంతో దేశంలో ఆహార భద్రత సాధించబడింది.1960 నుండి 1990 వరకు భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల దిగుబడిలో అత్యంత కృషిచేసిన మహానీయుడు.ప్రపంచవ్యాప్తంగా 18.7 కోట్ల ఎకరాలలో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన హరిత విప్లవం వల్ల ప్రపంచ దేశాలలో వందల కోట్ల మంది ప్రజల యొక్క ఆకలిని తీర్చగలిగింది.
బోర్లాగ్ చేసిన కృషిని గుర్తించి ఆయనకు 1970వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది.ఈ బహుమతి ఆయనకు లభించడం మానవాళికి చేసిన అత్యుత్తమ సేవకు నిదర్శనం.బోర్లాగ్ 2009 సెప్టెంబర్ 12న తన 95వ ఏట మరణించారు.బోర్లాగ్ ప్రవేశపెట్టిన హరిత విప్లవం నేటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.నార్మన్ బోర్లాగ్ మానవాళికి అందించిన అమూల్యమైన వరాలలో ఒకరు. ఆయన కృషి వల్ల లక్షలాది మంది ప్రజలు ఆకలి నుండి బయటపడ్డారు.ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆయనలాంటి శాస్త్రవేత్తలు మరింతగా ఉండాలని ఆశిద్దాం.(హరిత విప్లవ పితామహుడు బోర్లాగ్ వర్ధంతి సందర్భంగా)
కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694