Friday, September 20, 2024
spot_img

బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదే : సీఎం రేవంత్ రెడ్డి

Must Read
  • ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
  • బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు
  • బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది
  • బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది
  • వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మంగళవారం వెలుపడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల పై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్,బిజెపి పార్టీల పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపిను గెలిపించిందని అన్నారు.బీఆర్ఎస్ కు ఇక మిగిలింది బూడిదేనని ఎద్దేవా చేశారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారని తెలిపారు.బిజెపిను గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బదిలీ చేసిందని,అందుకే మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రెడ్డి ఓడిపోయారని విమర్శించారు.నమ్మి పోటీ చేసిన వెంకటరామి రెడ్డిను బీఆర్ఎస్ మోసం చేసిందని దుయ్యబట్టారు.20 శాతం ఓట్లు బీజెపీ పార్టీకు బదిలీ అయ్యాయని,సిద్దిపేట లో బీఆర్ఎస్ కు కేవలం 2000 మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పార్టీ 37శాతం ఓట్ల నుండి 16శాతం కు చేరుకుందని అన్నారు.ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ బిజెపికు తాకట్టుపెట్టిందని విమర్శించారు.కేసీఆర్ ఉన్నంత కాలం కుట్రలు,కుతంత్రాలే ఉంటాయని ఆరోపించారు. ప్రధాని మోడీ తన పదవికి హుందాగా రాజీనామా చేసి పదవి నుండి తప్పుకోవాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.మోడీ గ్యారంటీలను ప్రజలు తిరస్కరించారని,తక్షణమే మోడీ రాజీనామా చేయాలనీ అన్నారు.ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీ రాజీనామాను కోరాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ఎన్నికల ఫలితాల పై స్పందిస్తూ వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This