Friday, December 13, 2024
spot_img

దివీస్ ల్యాబ్‎కు అధికారుల క్లీన్ చిట్.?

Must Read
  • దివీస్ ఫార్మాకు పీసీబీ నుంచి ఫుల్ సపోర్ట్
  • హైదరాబాద్ శివారు అబ్దుల్లాపుర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్
  • ఫోన్ ద్వారా క్లీన్ చిట్ ఇస్తున్న అధికారి.!
  • శ్యాంపిల్స్ సేకరించకుండా డైరెక్ట్ గా పర్మిషన్
  • ప్రమాదకర వ్యర్థాలు కావు అంటూ బుకాయింపు
  • మాముళ్ల మత్తులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
  • దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు
  • చివరకి కథ కంచికే అంటున్న ప్రజలు

రాజకీయ, డబ్బు పలుకుబడితో తెలంగాణలో పలు దందాలు నడుస్తున్నాయి. డబ్బులు సంపాదించేందుకు ఎంతటి ఘోరానికి అయినా తెగబడుతున్నాయి కొన్ని పరిశ్రమలు. జనం ఆరోగ్యం ఎటుపోతే వారికేంటి. ప్రభుత్వాలు, అధికారులు మారినప్పుడల్లా వారితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారం కొనసాగిస్తారు. డబ్బులకు కక్కుర్తి పడే పాలకులు, ఆఫీసర్లు సదరు వ్యక్తులు, పరిశ్రమలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పరిధిలో ఉన్న దివీస్ ఫార్మా పరిశ్రమ. దీని ద్వారా నల్గొండ, భువనగిరి జిల్లాలకు చెందిన రైతులు, గీతకార్మికులు, స్థానిక గ్రామాల ప్రజలు గాలి, నీరు కాలుష్యంతో సతమతం అవుతున్నారు. దివీస్ ల్యాబ్ ద్వారా వెలువడే వ్యర్ధాల ద్వారా వాతావరణం అంతా కలుషితమై తీవ్ర అనారోగ్యం బారినపడుతుంటే పీసీబీ అధికారులు కంపెనీ యాజమాన్యానికి వంత పాడుతున్నారు. తద్వారా ఇక్కడి ప్రజల పరిస్థితి కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లుగా తయారైంది.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని రామోజీఫిల్మ్ సిటీ, మైసమ్మ గుడి ప్రాంతంలో గత నెల రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో పరిశ్రమల నుండి పారిశ్రామిక వ్యర్థాలను తీసుకువచ్చి నిర్మానుష్య ప్రదేశంలో వదలుతున్నారు. తద్వారా ఆ ప్రాంతం అంత ఘాటైన వాసనలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది.

దివిస్ ట్యాంకర్ ను పట్టుకున్న రిపోర్టర్లు :

ఎక్కడో ఫార్మా కంపెనీ నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి తమ ప్రాంతంలో పోస్తున్నారని అబ్దుల్లాపూర్ మెట్ ప్రజలు వాపోతున్నారు. గత నెల రోజులుగా వ్యర్థాలు తెచ్చి ఇక్కడ పారబోస్తున్నారని స్థానిక ప్రజలు విలేకురుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా స్థానికుల ఇబ్బందులు గమనించిన మండలానికి చెందిన పలువురు రిపోర్టర్ లు జాతీయ రహదారి నుండి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లడం గమనించిన వారు హిందుస్థాన్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ప్రశ్నించడంతో డ్రైవర్ కర్ణాటకకు యాసిడ్ పంపిస్తున్నామని తెలియచేసి కర్ణాటక రాష్ట్రంలోని ఒక పరిశ్రమ పేరుతో ఉన్న బిల్లును చూపించడం గమనార్హం.

డ్రైవర్ మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు సమాచారం:

రిపోర్టర్లు పట్టుకున్న ట్యాంకర్ కు సంబంధిన డ్రైవర్ ను ప్రశ్నిస్తే పొంతన లేని మాటలు చెబుతుండడంతో అనుమానించిన రిపోర్టర్లు వెంటనే స్థానిక పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ దగ్గరకు ట్యాంకర్ ను పంపించి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫోస్ ద్వారా క్లీన్ చిట్ :

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్ కు సంబంధించి రిపోర్టర్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారికి ఫోన్ చేసి వెల్లడించారు. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో నిత్యం ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలు తెచ్చి పారబోస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తుండగా పట్టుకున్నామని రిపోర్టర్లు తెలియజేశారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారి మాత్రం వెంటనే ట్యాంకర్ లో ఉన్న వాటి నమూనాలు సేకరించకుండానే అవి వ్యర్థాలు కావు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. వ్యర్థాలు కావు అదీ యాసిడ్ అని అధికారి బుకాయించాడు. దీన్ని బట్టి చూస్తే దివిస్ ల్యాబ్స్ కి పీసీబీ అధికారులు కట్టు బానిసలుగా ఎలా మారారో ఇట్టే తెలుస్తోంది. దివీస్ కంపెనీని ఎలా కాపాడుతున్నారో అర్ధమవుతోంది. ఇలాంటి అధికారులు దివిస్ ల్యాబ్ పరిశ్రమ కాలుష్యంపై పిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రిపోర్టర్ల నిజాయితీపై ప్రశంసలు :

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పట్టుకున్న దివిస్ ల్యాబ్స్ ట్యాంకరును పట్టుకున్న రిపోర్టర్లు వివిధ వ్యక్తుల ద్వారా ఫోన్ లో ఏదైనా ఉంటే మాట్లాడుదామని చెప్పడం జరిగింది. మీరు తొందర పడి ఏ పేపర్ లో పత్రికలలో దివిస్ ల్యాబ్స్ ట్యాంకర్ పట్టుబడ్డది అని వార్తలు ప్రచురించవద్దని కోరారు. ఈ విషయం ఎవరికి సమాచారం ఇవ్వవద్దని మీతో మాట్లాడుతామని ఒత్తిడులు తెచ్చినా విలేకరులు ఊరుకోలేదు. దివీస్ ల్యాబ్స్ కాలుష్యంపై ఇప్పటికే చిట్యాల, చౌటుప్పల్, నారాయణపురం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం… నిత్యం ప్రతి రోజు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్నా విషయం తెలిసి కూడా మేము అన్యాయం వైపు కాకుండా న్యాయం వైపు ఉంటామని ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా ఎన్ని ప్రయోజనాలు ఆశ చూపినా చివరకి రిపోర్టర్లు ప్రజల పక్షాన నిలబడడంతో ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

దివీస్ ల్యాబ్స్ కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వరు :

అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్ దివిస్ ల్యాబ్స్ కి చెందినది కావడంతో శ్యాంపిల్స్ సేకరించకుండానే ట్యాంకర్లలో ఉన్న వ్యర్థాలు కావని ఫోన్ ద్వారానే పీసీబీ అధికారులు ధృవీకరించారు. అదే శ్యాంపిల్స్ తీసుకున్న తర్వాత మాత్రం రిపోర్ట్ దివిస్ కు అనుకూలంగా ఇస్తారు. అంతే తప్ప కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివీస్ వ్యతిరేకంగా ఇచ్చే సాహసం చెయ్యరనేది జగమెరిగిన సత్యం. ఇదంతా రెండు రోజుల తరువాత కథ కంచికే అన్నట్లు అవుతుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజల పక్షాన కాకుండా కార్పొరేట్ సంస్థ అయిన దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ము కాస్తారని పెద్ద ఆశలు పెట్టుకోవద్దని పెదవి విరుస్తున్నారు.

ఇకనైనా దివీస్ ల్యాబ్ ద్వారా వెలువడే వ్యర్థాలు ఎంత ప్రాణాంతకమో శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్ ఆధారంగా పరిశ్రమపై, అలాగే మాముళ్లు తీసుకొని ఫార్మా కంపెనీకి ఒత్తాసు పలుకుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS