Friday, September 20, 2024
spot_img

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

Must Read

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో ప్రస్తుతం దానిపై దర్యాప్తు కొనసాగుతుంది.తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ బాదావత్ వాట్సప్‌ డీపీతో బుధవారం నకిలీ అకౌంట్‌ను క్రియేట్‌ చేశారు.పలువురు అధికారులతో చాటింగ్‌ చేశారు.ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌ దృష్టికి తేవడంతో స్పందించిన కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపారు. వెంటనే సంబంధిత అకౌంట్‌ ఫోన్‌ నెంబర్‌పై పోలీసులు దృష్టి పెట్టారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 94782854487 నెంబర్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారని తెలిపారు.ఈ నెంబర్‌ నుంచి కాల్‌ చేసిన,చాటింగ్‌ చేసిన వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.సైబర్‌ నేరాల విషయంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This