Friday, November 22, 2024
spot_img

పాత రికార్డులే కానీ.!

Must Read
  • బీఈడీ స్టూడెంట్స్ సరికొత్త ప్లాన్
  • ఓయూలో బట్టబయలు అయిన వైనం
  • అట్టాలు మార్చి పాత రికార్డులు సబ్మిట్
  • పట్టించుకోని ఓయూ అధికారులు
  • ఎలాంటి అర్హత లేకున్నా బీఈడీ పూర్తి
  • ఓల్డ్ స్టూడెంట్స్, పాత పుస్తకాలను తమ పేరిట మార్పు

‘చదువుకుంటే ఉన్న మతి పోయింది అన్నట్టు’ పై చదువులు చదివే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసమే రకరకాల చదువులు చదువుతున్నారు. ఇందులో భాగంగా బీఈడీ స్టూడెంట్స్ పాత రికార్డులు సబ్మిట్ చేస్తూ చదువు పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని నవాబ్ షా కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్, ఎస్ఆర్ఎం బీఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్, జేఈసీ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్, శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కళాశాలలోని విద్యార్థులు రికార్డులను రాయకుండా స్టడీ కంప్లీట్ చేస్తున్నారు. ఓల్డ్ స్టూడెంట్ల రికార్డులను తీసుకొని వాటికి పైన కొత్త అట్టలు అమర్చి పాత వాటినే తిరిగి సబ్మిట్ చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పరిశీలించే క్రమంలో చూపించి మోసం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) ఛైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పై కళాశాలల రికార్డులను తనిఖీ చేయకుండానే ఆ కాలేజీలకు క్లీన్ ఛీట్ ఇస్తున్నారు.

ఈ విషయంపై సదరు అధికారిని నిలదీస్తే మాకు ఎలాంటి సంబంధం లేదు అని దాటవేస్తున్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ ఎన్.సునీత వ్యవహార శైలిపై అనుమానాలు తలెత్తుతుంది. దీనివెనుక ఉన్న అసలు విషయం ఏంటో తేలాల్సి ఉంది. మళ్లీ ఆయా కాలేజీల రికార్డులను వెరిఫికేషన్ చేయాలని కంట్రోలర్ కు, అడిషనల్ కంట్రోలర్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.

ఇదీలా ఉండగా పై కాలేజీల్లో చదివిన విద్యార్థులు పాత రికార్డులను కొత్తగా సబ్మిట్ చేయడమే గాక అటెండెన్స్, రికార్డుల మెయింటెన్స్ కోసం ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కళాశాల మేనేజ్ మెంట్ ఓ అధ్యాపకుని చేతిలో పెట్టి నడిపిస్తుండడం గమనార్హం.ఈ కాలేజీలలో చదివే ఎక్కువ మంది విద్యార్థులు రికార్డులలో కనీసం ప్రిన్సిపాల్ సంతకాలు కూడా పోర్జరీ చేసినట్లు సమాచారం. ఈ రికార్డులలో స్కూల్ హెడ్ మాస్టర్ సంతకం కూడా ఉండాలి. కానీ సంతకం లేకుండానే రికార్డులు సమర్పించడం జరిగింది. చాలా వరకు పాత రికార్డులను కవర్ పేజీలు మార్చి సబ్మిట్ చేసినట్లు ఫిర్యాదు చేసిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు రికార్డులలో వేరు వేరు చేతిరాతతో రికార్డులు ఉండడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది.

పైన తెలిపిన కాలేజీలు ఇలాంటి మరెన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులకు ఆశపడి పాత రికార్డులు సబ్మిట్ చేసినందుకు, విద్యార్థుల వద్ద పైసలు తీసుకొని అటెండెన్స్ వేస్తున్న కళాశాలలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, ఆయా కళశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS