Friday, September 20, 2024
spot_img

సినీ విశ్వంలో పవనోదయం

Must Read

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 02 సందర్భంగా

సినీ తుఫాన్:

సాధారణంగా సినీహీరోలందరికీ అభిమానులు ఉంటారు.కానీ ఆయనకు మాత్రం భక్తులుంటారు..! మనదేశ సినీ దర్శకదిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి వంటి వారు కూడా పవన్ క్రేజ్ కు విపరీతంగా ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమాలో ఇంటర్వేల్ సీన్ పవన్ అభిమానుల స్ఫూర్తితోనే తీశాడంటే మాటల్లో,రాతల్లో పవన్ గురించి ఏం చెప్పగలం.శ్రీశ్రీ మహాప్రస్థానం లోని “నే నొక దుర్గం!నా దొక స్వర్గం! అనర్గళం,అనితరసాధ్యం,నా మార్గం “ఈ అక్షరాలను పవన్ జీవన ప్రస్థానానికి అనువర్తించవచ్చు.

తొలి అడుగులు:

సినీ వినీలాకాశంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అమితాబచ్చన్,రజనీకాంత్,కమల్ హాసన్ వంటి విఖ్యాత భారతీయ నటుల స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా నెంబర్ వన్ పొజిషన్లో సినీ ప్రేక్షకులను అలరించి వారి హృదయ సింహాసనంపై “ఇంద్ర” గా ముద్రించుకున్నారు.అలాంటి చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన పవన్ గత 25 సంవత్సరాలు గా సృష్టించిన సెల్యూలాయిడ్ ప్రభంజనం చిరంజీవి స్థాయికి ఏమాత్రం తక్కువ కాదు.అతిశయోక్తి కాదంటే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ,సేవలోనూ,వ్యక్తిత్వపు శిఖరంలోనూ చిరును దాటాడనే కొంత వరకు చెప్పవచ్చు.అయినా “నా అన్నే నా జీవితహీరో అని చెబుతూ భారతదేశ ప్రధాని సాక్షిగా ఓ వేదికపై ఓ వేడుకలో తన అన్న కాళ్ళను స్పర్శిస్తూ తన సంస్కారంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారు పవన్.

దేశభక్తి ని చాటుతూ:

పవన్ తన ప్రతి సినిమాలో సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ సామాజిక బాధ్యతను గుర్తుచేశారు.దేశభక్తికి సంబంధించిన పాటలు,సీన్లు చిత్రీకరించేలా ప్రత్యేక శ్రద్ధ పెడతారు.ఆడవారి రక్షణ గురించి ఓ నిజజీవిత హీరోలా నిలబడతాడు.యువతను మోటివేషన్ చేసేలా పాటల లిరిక్స్ చూసుకుంటారు.గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వు కేక” పాటచేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ చాలా రిక్వెస్ట్ చేస్తూ మీరు మన అభిమానుల కోసం చెయ్యాలంటే తన మనస్సు చంపుకోని ఆ పాటకు డాన్స్ చేసిన పవన్ ను గమనిస్తే సినిమాను ఓ బాధ్యతగా భావిస్తూ తన సినిమాల్లోనూ అసభ్యతకు, అశ్లీలతకు తావులేకుండా చూసుకుంటారని అర్థమవుతుంది.కుటుంబం మొత్తం చూసేలా వుంటాయి పవన్ సినిమాలు.

అసాధారణ విష(జ)యాలు:

ఒంటరితనాన్ని ,ఏకాంతాన్ని ఇష్టపడే పవన్ ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దశ నుంచి వందలాది వేదికలపై అనర్గళంగా ఉపన్యసిస్తూ కోట్లాదిమందికి స్ఫూర్తినిచ్చే దిశలో నేడు డిప్యూటీ సీఎం గా వున్నారు.తమ్ముడు సినిమాతో ఆంధ్ర స్టూడెంట్ పవర్ చూపి,బద్రి… బద్రినాథ్ అంటూ పూరి మాటల గన్ ను పేల్చి తొలిప్రేమతో ఓ చరిత్రను సృష్టించి ఖుషితో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.దాదాపు పది సంవత్సరాలు జల్సా సినిమా తప్ప పెద్దగా హిట్ మూవీ లేక పవన్ ప్రయాణం కొనసాగింది.అలాంటి సందర్భాల్లో కూడా పవన్ అభిమానుల ప్రేమతో ఆరాటం ఏమాత్రం తగ్గకపోవడం భారతదేశ సినీ చరిత్రనే ఆశ్చర్యపరిచింది.పవర్ స్టార్ ను ప”వన్”స్టార్ ను చేసింది.”నేను ట్రెండ్ ఫాలోవ్వను.సెట్ చేస్తాను!” అంటూ గబ్బర్ సింగ్ చేసిన ఆనాటి హాంగామా ఇప్పుడు ఆ సినిమా రీరిలిజ్ చేస్తే కూడా నేడు రిలీజ్ స్థాయిలో ఓపేనింగ్స్ వస్తున్నాయి.పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా విజయం పవన్ స్థాయి ఏంటో మళ్ళీ ఓసారి నిరూపించబడింది.పాన్ ఇండియా సినీ స్టార్స్ సైతం కళ్యాణ్ కు అభిమానులమని గర్వంగా చెప్పకుంటున్నారంటే ఆయన స్టామినా మనం అర్థం చేసుకోవచ్చు.

తోటి సినీహీరోలతో…

తన అన్న స్థాయి సినీహీరోలైన వెంకటేష్, బాలకృష్ణ లతో పవన్ చాలా అప్యాయంగా వుంటారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు,పవన్ లు మంచి స్నేహితులు.మహేష్ ట్విట్టర్ వేదికగా చాలా సందర్భాల్లో పవన్ ను అభినందిస్తూ ఆయన ఎదుగదలను కోరుకోవడం మహేష్ లోని సూపర్ స్టార్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.సాధారణంగా నేడు టాలీవుడ్ లో పవన్, మహేష్ సినిమాల మధ్యే విపరీతమైన పోటీ వున్న ఆ ఇద్దరూ హీరోలు మరియు వారి అభిమానులు పరస్పర గౌరవభావంతో వుంటారు.సినీ ఇండస్ట్రీలో అందరితో అవసరమైనంతలో మంచి సత్సంబంధాలు పవన్ కలిగి వుంటారు.

వకీల్ సాబ్,భీమ్లా నాయక్,బ్రో వంటి మంచి విజయాలతో దూసుకుపోతున్న పవన్ రాబోయే చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.శ్రీ శ్రీ,తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి మహాకవుల రచనలను తన ప్రసంగాల్లో తరుచుగా ప్రస్తావించే పవన్ కు తెలుగు సాహిత్యం, తెలుగు భాషంటే ఎనలేని గౌరవం.ఆయన ఇలాగే తెలుగు భాషోభివృద్దికి కృషి చేస్తూ తన జీవన ప్రయాణంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలన్నా తన అభిమానుల ఆశలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ సార్.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This