- పంచాయతీ కార్యదర్శిని కాపాడుతున్నది ఎవరు?
- డబ్బులు ఇస్తే ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ ఇచ్చేస్తాడు
- అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడంటూ ఆరోపణలు
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శి ఎల్లయ్య
- తొలగించాలంటూ మంత్రులకు అధికారులకు ఫిర్యాదు
- మంత్రుల ఆదేశాలు లెక్కచేయని ఉన్నతాధికారులు
- కార్యదర్శి ఎల్లయ్యకు, డిపిఓకున్న సంబంధమేంది..?
- ఎల్లయ్యను తొలగించాలంటూ గ్రామ సభలో ఫిర్యాదు
- పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 218 ఇతగాడికి వర్తించదా..
అవినీతి సొమ్ముకు ఆశపడి అక్రమార్కులకు అండదండగా ఉంటూ ప్రజలను ఇబ్బందుల గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి(Secretary) పై గ్రామస్తులు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అక్కడితో ఆగకుండా మంగళవారం అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆ కార్యదర్శి మాకొద్దు అతని తొలగించండి. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, కొండకల్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య గ్రామంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అక్రమార్కులకు అండగా ఉంటూ భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా దూరి గ్రామస్తులను రైతులను గిరిజనులను ఇబ్బందులు పెట్టడం తో కార్యదర్శి పై గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. గ్రామంలో ఇల్లు లేకున్నా ఎంతోమందికి డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు కేటాయించారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇదే కాకుండా గ్రామంలో ఉన్న సీలింగ్ అసైన్డ్ భూముల్లో ఉన్న రైతులను ఇబ్బందులు పెడుతూ కార్పొరేట్ యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని అతనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అతన్ని తమ గ్రామం నుంచి తొలగించాలని అతనితో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మోకిలను కావలని కౌన్సిలింగ్ లో పెట్టకుండా బదిలీలలో పెట్టలేదని పెద్ద మొత్తంలో వసులు చేసి ఇవ్వడం జరిగింది. జూలై లో బదిలీలు జరగగా ఆగస్టులో ఇతనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జులై లో కొండకల్లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, కొద్ది రోజుల క్రితం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. స్పందించిన మంత్రులు ఇతనిని సస్పెండ్ చేస్తూ, డీపీఓ ఆఫీస్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేయకుండా ఆగష్టు లో ఇతనికి మోకిలా లో ఇంచార్జిగా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో అప్పటి కలెక్టర్ శశాంక్, మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క లను తప్పుదోవ పట్టించడం జరిగింది. ఎల్లయ్యకు పంచాయతీ విషయాలపై ఎలాంటి అవగాహన లేనప్పటికి పెద్ద గ్రామాలు అయిన రెండు మోకిలా, కొండకల్ లకు కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
జిల్లా పంచాయతీ అధికారి నిమ్మకు నీరెత్తినట్టు ఎల్లయ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం చూస్తుంటే ఆయనకు పంచాయతీ కార్యదర్శి కున్న సంబంధం ఏందో అర్థం కావడం లేదంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక డిపిఓ ఒక పంచాయతీ కార్యదర్శి ఎందుకు భయపడుతున్నాడు. వీరి ఇద్దరి మధ్యన ఎలాంటి లావాదేవీలు జరిగి ఉంటాయో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర మంత్రులు చెబితే కూడా వారి మాటలు లెక్కచేయకుండా ఆ పంచాయతీ కార్యదర్శిని అలాగే కొనసాగించడం పట్ల డిపిఓ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల మాటలు కూడా లెక్క చేయని సదరు అధికారిపై కూడా చర్యలు చేపట్టి వారిని విచారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య ఏసీబీ ఇన్కమ్ టాక్స్ విజిలెన్స్ వాళ్ళు కూడా విచారణ జరిపితే కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు బయట పడతాయని పేర్కొన్నారు.
తాజాగా ఫిర్యాదు.. గ్రామ సభను అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వం అమలు చేసే నాలుగు సంక్షేమ పథకాల గురించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో కూడా అధికారులు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య వ్యవహారం తేల్చాలంటూ గ్రామసభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలపై అధికారులకు తాజాగా ఫిర్యాదులు చేశారు. గ్రామంలో అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడను కూల్చివేయడంలో అధికారులు విఫలమయ్యారని ప్రహరీ విషయంలో కూడా ఎల్లయ్య అవినీతికి పాల్పడి కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యానికే కొమ్ముకాస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఆ కార్యదర్శి తొలగించినంతవరకు గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరి ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదులపై పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.