Friday, November 22, 2024
spot_img

అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన ఆర్.టీవీ యాజమాన్యం

Must Read
  • సంస్థ పై ఎలాంటి దాడులు జరగలేవు :ఆర్.టీవీ యాజమాన్యం
  • నిబద్దతతో ముందుకు వెళ్తున్నాం
  • అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన యాజమాన్యం

గత రెండు రోజులుగా రవి ప్రకాష్ స్థాపించిన ఆర్.టీవీ పై ఈడీ రైడ్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా లో వరుసగా వార్తలు వస్తున్నా క్రమంలో ఆర్.టీవీ యాజమాన్యం స్పందించింది.తమ ఛానల్ పై దుష్ప్రచారం చేస్తున్నారని యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.రవిప్రకాష్ స్థాపించిన ఆర్.టీవీ డిజిటల్ మీడియా ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది.పార్లమెంట్ ఎన్నికల ముందు ఆర్.టీవీ ఛానల్ చేపట్టిన సర్వే వందశాతం నిజమైంది.కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని రవిప్రకాష్ బల్లగుద్దినట్టు తేల్చిచెప్పారు.దీని పై అయిన సుదీర్ఘ కసరత్తు కూడా చేశారు.ఎట్టకేలకు రవిప్రకాష్ చేపట్టిన సర్వే నిజమైంది.అయిన చెప్పినట్టే కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది.దింతో ఒక్కసారిగా ఆర్.టీవీ గ్రాఫ్ పెరిగింది.ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఆర్.టీవీ కార్యాలయం పై ఈడీ దాడులు చేసినట్లు కేటుగాళ్లు ఫేక్ ప్రచారానికి తెరలేపారు.తాజాగా వస్తున్నా వార్తల పై ఆర్.టీవీ స్పందించింది. తమ సంస్థ నిజాయితీ,నిబద్దలతో ముందుకు వెళ్తుందని తెలిపింది.కొద్ది నెలలలోనే డిజిటల్ మీడియా రంగంలో మొదటి స్థానంతో పాటు,సురక్షితమైన స్థానంలో ఉన్నట్లు రవిప్రకాష్ తెలిపారు.మరోవైపు డిజిటల్ మీడియా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఆర్ టివి పై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా స్పందించింది. అబద్దపు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆ సంఘం తెలిపింది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS