- కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
- గణేష్ గెలుపు కోసం అందరిని ఏకతాటి పైకి తీసుకువచ్చిన పల్లె లక్ష్మణ్
- గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకున్న పల్లె లక్ష్మణ్
- 59,057 మెజారిటీ తో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గణేష్
కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ ను అభినందించారు.ఇదిలా ఉంటే గణేష్ గెలుపు కోసం ఇంచార్జి పల్లె లక్ష్మణ్ గౌడ్ ఎంతో కృషి చేశారు.కంటోన్మెంట్ అభ్యర్థిగా గణేష్ ను గెలిపించే బాధ్యతను భుజన ఎత్తుకున్నారు.ప్రతిఒక్క కార్యకర్తను , స్థానిక నాయకులను అందరిని ఏకతాటిపైకి తీసుకోని వచ్చి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచే విధంగా అడుగులు వేశారు.ప్రతిఒక్క ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ను గెలిపిస్తే కంటోన్మెంట్ లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లి వాటిని పరిష్కరించే విధంగా గణేష్ కృషి చేస్తారని ప్రజలకు వివరించడంలో లక్ష్మణ్ గౌడ్ సక్సెస్ అయ్యారు.ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, బీజేపీ అభ్యర్థిగా తిలక్సహా 15 మంది పోటీలో నిలిచారు.మే 13న కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.85 శాతం ఓట్లు పోలయ్యాయి.మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెెక్కింపుతో ప్రక్రియ మొదలైంది.అనంతరం పలు రౌండ్లలో జరిగిన చివరగా కాంగ్రెస్అభ్యర్థి శ్రీగణేశ్ విజేతగా నిలిచారు.