Sunday, November 10, 2024
spot_img

నియంత పాలనకు మరణ శాసనంగా మారిన తీన్మార్ మల్లన్న

Must Read
  • లక్ష వార్తల ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి పునాది
  • మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం కుంభకోణం వరకు
  • గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు
  • తెలంగాణకు కాగడ దివిటి తీన్మార్ మల్లన్న
  • వాగ్దాటితో గొంతు చీల్చుకొని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో క్యూ న్యూస్
  • పట్టబద్రులారా.. పదిఏళ్ల చరిత్రను మర్చిపోవద్దు.. తీన్మార్ మల్లన్న ను గెలిపించండి.
  • కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు, గంగుల నరసింహారెడ్డి

నల్గొండ ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల బరిలో ఉన్న క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని,కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు ప్రజాపట్టభద్రులకు పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న ఒక సాధారణ జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ,గత 10 ఏండ్ల తెలంగాణలో నియంతృత్వ నిరంకుశ అధికార ,కుల , ధన దురంకార అప్రాతిహితంగా కొనసాగిన నియంత పాలన.బంధుప్రీతి ఆప్రజాస్వామిక పాలనలో, విద్యార్థుల ప్రాణ త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను పాతాళానికి తొక్కేసి, లక్షల ఎకరాల బినామీలతో కమీషన్ల పాలన కొనసాగిస్తూన్న అవినీతి పాలనలో ,ప్రతిపక్షాలు భాగమై ఏకపక్ష పాలన కొనసాగుతున్న ఇలాంటి భయంకర విపత్కర పరిస్థితుల్లో దిక్కుమక్కు లేని నిరుపేద ప్రజానీకానికి కటిక చీకటిని చీల్చిన క్యూ న్యూస్ .అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో లక్ష ఓట్ల తో ప్రతిపక్షాలకు చావు తప్పి కళ్ళు లొట్ట పోయే! అప్పటివరకు ప్రజా సమస్యలు పాతరేసిన ప్రతిపక్షాలు మల్లన్న ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుండని పసిగట్టి ప్రజల్లోకి వచ్చారు. అంటే మల్లన్న పోరాట పట్టిన ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.తన వాగ్దాటితో గొంతు చీల్చుకొని అన్యాయాలు అక్రమాలు పై పొద్దు పోడవకముందే ప్రజా దర్బారు పెట్టి, పేదల పక్షాన గొంతుకై తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న ను అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించి వేధింపులకు గురి చేశారు. ‘నియంత పాలకులపై పోరాడి ఒక సామాన్యుడు శాసించే అధికారం పొందగలరు’ అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించారు .తెలంగాణ రాష్ట్రంలో కుటుంబంలో నలుగురికి నచ్చిందే విధానం , వారికి మేచ్చిందే శాసనం . గత చరిత్రను మర్చిపోవద్దు. ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ పెద్దల పొగడ్డంతో పోటీపడి నియోజకవర్గం సమస్యలు గాలికి వదిలేసి ఆరోగ్యశ్రీ ,కళ్యాణ లక్ష్మి పథకాలకే పరిమితమైనా పరిస్థితుల్లో ప్రజా సమస్యలను తన గొంతుకతో వెలుగెత్తి చాటాడు.తెలంగాణలో చదువుల ఒత్తిడితో విద్యార్థులు, కొలువు లేక నిరుద్యోగులు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు నిరుద్యోగ ప్రజా పట్టభద్రులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకను శాసన మండలి కి పంపించాలి. ప్రభుత్వంలో కొనసాగుతున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు ప్రైవేట్ సంస్థల్లో వెట్టిచాకిరి ,శ్రమదోపిడి పోవాలంటే గత పది ఏళ్ల చరిత్ర గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.ప్రపంచ చరిత్రలో ప్రశ్నించే గొంతుపాలకుడై నిలుస్తున్న తీన్మార్ మల్లన్న గొప్ప మానవత వాది, పోరాట యోధుడు, గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు పేదల గుండె చికిత్సలతో పాటు నీట మునిగిన గుడిసె లకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చిన మానవతావాది.నియంత పాలనకు మరణ శాసనంగా మారిన నిరంత శ్రామికుడు తీన్మార్ మల్లన్న .మిషన్ భగీరథ నుండి కాళేశ్వరం కుంభకోణాల అవినీతిని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో, కాలేశ్వరం కుంగుబాటు, ముందే ఊహించిన దూర దృష్టి కలిగిన తీన్మార్ మల్లన్న ప్రజలకు క్రాంతి దివిటియై తోవచూపిన మల్లన్న .గత పది ఏళ్ల చరిత్రను,మల్లన్న త్యాగాలను గుర్తుంచుకొని తెలంగాణ ప్రజా పట్టబద్ధులు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS