- రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యం
- పీసీబీ అధికారులకు కంపెనీతో వాటాలు
- ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన చర్యల శూన్యం
- అవినీతి మత్తులో పీసీబీ అధికారులు
- రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని వైనం
- టాస్క్ ఫోర్స్ మీటింగ్ లు సూచన ప్రాయమే
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ధోతిగూడెం గ్రామంలోని రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. కాలుష్య కాసారాలు వెదజల్లె కంపెనీలకు పీసీబీ అధికారులు అండగా నిలుస్తున్నారు. యాజమాన్యం గతంలో ఇదే పరిశ్రమ సిలికాన్ డ్రగ్స్ పేరుతో ప్రారంభించబడింది. సిలికాన్ పరిశ్రమ యాజమాన్యం ఏ రోజు పరిశ్రమ ప్రారంభించిన నాటి నుండి రావూస్ యాజమాన్యానికి విక్రయించే వరకు నిబంధనలను నిలువునా పాతరవేసి పరిసర ప్రాంతాలను కాలుష్య కాసారాలుగా మార్చి వేసినారు కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీ చావు మీరు చావండి అని పరిశ్రమను రావూస్ యాజమాన్యానికి విక్రయించి తన దారిన తాను వెళ్లిపోయాడు. సిలికాన్ డ్రగ్స్ పరిశ్రమను కొనుగోలు చేసిన రావూస్ లాబరేటరీ పరిశ్రమ యాజమాన్యం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. స్థానిక రైతుల పంటలు పండక పోవడంతో రావూస్ పరిశ్రమపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గాని కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టవలసిన కాలుష్య నియంత్ర మండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టడం లేదు.
నిబంధనలకు పాతర :
రావూస్ పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమ నుండి వెలువడే వ్యర్ధాల నిర్వహణ నిబంధనల ప్రకారం పరిశ్రమ పరిధిలో జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టం ద్వారా పూర్తిగా శుద్ధి చేసి తిరిగి నీటిని పునర్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ద్వారా శుద్ధి చేస్తే ఆర్థిక భారం అవుతుందని అడ్డదారిలో వ్యర్ధాల తరలించడం లేదా పరిశ్రమ పరిధిలోనే వివిధ మార్గాల ద్వారా భూగర్భంలోకి పంపడంతో పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. స్థానిక ప్రజలు రైతులు రావూస్ పరిశ్రమపై ఫిర్యాదులు చేస్తున్నారంటే రావూస్ యాజమాన్యం నిబంధనలకు పాతర వేస్తున్నది.
పీసీబీ అధికారికి సన్నిహిత సంబంధాలు :
రావూస్ లాబరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం వ్యర్ధాల నిర్వహణలో నిబంధనలు పాటించక పోయిన ప్రజల నుండి రైతుల నుండి రావూస్ పరిశ్రమపై ఫిర్యాదులు వచ్చినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రావూస్ యాజమాన్యంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఇటీవల బదిలీపై వెళ్లి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ గా పని చేస్తున్న సురేశ్ తో యాజమాన్యంతో సన్నిహితంగా ఉండేవారు అని ఏ ప్రయోజనాలు ఆశించి రావు అక్రమాలకు సహకరించారో కాలుష్య నియంత్రణ మండలి అధికారులే చెప్పాలి లేదా రావూస్ పరిశ్రమలో పీసీబీ అధికారి సురేష్ కు వాటాలు ఉన్నాయా అన్న విషయంపై అధికారులు విచారణ చేస్తే అన్ని బయటపడతాయి.
రావూస్ ఫిర్యాదులపై చర్యలు శూన్యం :
రావూస్ లాబరేటరీ పరిశ్రమ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు సమీప గ్రామాల ప్రజలు చేసిన అభ్యర్థనపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్వయంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తో కలిసి చేతుల స్థాయిలో సందర్శించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుమారు మూడు నెలలు గడుస్తున్నా రావూస్ ల్యాబ్స్ పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ పర్యావరణ ఇంజనీరు సంగీత జాయింట్ రిపోర్టులో రావూస్ పరిశ్రమ ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగడం లేదని పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చారంటే నల్లగొండ జిల్లా పర్యావరణ ఇంజనీర్ సంగీత ఏ స్థాయిలో పరిశ్రమ యాజమాన్యం తో కుమ్మక్కయ్యారో తెలుస్తుందని నెల, నెల బోర్డు ద్వారా వేతనాలు పొందుతున్నప్పుడు నిజాయితీగా పని చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఏ విధంగా పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నా పీసీబీ మీటింగులు ఉత్తుత్తివే :
కాలుష్యం వెదజల్లే రావూస్ లాబొరేటరీ పరిశ్రమపై గ్రామస్తులతో పాటు పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుడు ఫిర్యాదులు చేసి క్షేత్రస్థాయిలో సందర్శించి చర్యలు చేపట్టమని ఆదేశించి మూడు నెలలు గడిచిన టాస్క్ఫోర్స్ మీటింగ్ కు ఫిర్యాదుదారులైన పార్లమెంటు సభ్యుడికి శాసనసభ్యుడికి సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమకు సూచనలు జారీ చేసి చేతులు దులుపుకోవడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమ యాజమాన్యాలతో కుమ్మక్కై నారని అర్థమవుతుంది ఎంపీ, ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదంటే సామాన్య రైతు కంప్లైంట్ కు చర్యలు ఎక్కడ ఉంటాయి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.