కాంగ్రెస్ పార్టీ వివిధ కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ అంటేనే అవినీతి అని అన్నారు. దేశాన్ని బలహీనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, హరియాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రను భగ్నం చేశారని వ్యాఖ్యనించారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి వారి కుట్రలను భగ్నం చేయాలని కోరారు.
నవంబర్ 09 కి చరిత్రలో అత్యంత ప్రాధన్యం ఉందని, 2019 లో ఇదే రోజు సుప్రీంకోర్టు రామమందిరంపై తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుంటుందని విమర్శించారు.