Friday, September 20, 2024
spot_img

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను,ఆస్తులను కాపాడాలి

Must Read
  • సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ డిమాండ్

130కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ,సరైన ఏర్పాట్లేవీ లేనిచోట వేలాది జనంతో సత్సంగ్ నిర్వహించిన భోలేబాబా,అతడి అనుచరులు ఈ మారణకాండకు ప్రధాన కారకులు అని పేర్కొన్నారు.నేరచరిత్ర కలిగిన ఒక వ్యక్తికి అమాయక భక్తజన భావోద్వేగాలతో మృత్యుక్రీడలాడే అవకాశమిచ్చిన ప్రభుత్వం హార్రస్ మహావిషాదానికి బాధ్యత వహించాలని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే.కే.ఆర్,జేఎస్ఆర్ సార్ అభిప్రాయపడ్డారు.ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లావాసి అయిన సూరజ్ పాల్- 28 ఏళ్ల క్రితం హెడ్కానిస్టేబుల్గా పని చేసేవాడు.మంత్ర తంత్రాలు,లైంగిక దోపిడీకి సంబంధించిన కేసులో నిందితుడైన అతణ్ని అప్పట్లో ఉద్యోగంలోంచి గెంటేశారు.జైల్లోంచి విడుదలయ్యాక నారాయణ్ హరి అలియాస్ సాకార్ విశ్వహరిగా పేరు మార్చుకున్న సూరజ్పాల్,స్వయంప్రకటిత దేవుడయ్యాడు అని అన్నారు.ముప్పై ఎకరాల్లో ఆశ్రమాన్ని, ‘సేవాదార్ పేరిట సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.మంచినీళ్లతో సర్వరోగాలను నయం చేయగలిగిన మహిమాన్విత భోలేబాబాగా సూరజ్పాల్ను కొలుస్తూ- ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులు కొన్ని లక్షల మంది అతడి మాయవలలో చిక్కుకున్నారు.ఆ బాబాపై పలు కేసులున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ చెబుతున్నారు.లైంగిక వేధింపులు,భూఆక్రమణల అభియోగాలను నెత్తినమోస్తున్న భోలేబాబా సేవలో యూపీలోని బడా రాజకీయ నాయకులతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులెందరో తరించిపోతుంటారనీ కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.కొవిడ్ కల్లోల కాలంలో వేలమందితో సమావేశాలు పెట్టిన బాబాపై ఈగైనా వాలలేదు.ఓట్ల రాజకీయాలకోసం ఇటువంటి నకిలీ బాబాలకు పొర్లుదండాలు పెడుతున్న నేతాగణాలు మానవాభివృద్ధిని పొట్టనపెట్టుకునే సామాజిక విష రుగ్మతలను పెంచి పోషిస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఆశలు,భయాలను పెట్టుబడిగా మార్చుకుని,ఆధ్యాత్మికత ముసుగులో ఆరాచకాలకు పాల్పడిన కేటుగాళ్లకు దేశీయంగా లోటేమీ లేదనీ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ప్రజాతంత్ర ఉద్యమకారుడు జై బోరన్న సుభాషన్న బాధపడ్డారు.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆశారాం బాపు, రామ్పాల్, సురాబాబా… ఇలా చెప్పుకొంటూ వెళ్తే హత్యలు,అత్యాచారాలు,మోసాలు,భూకబ్జాల వంటి ఎన్నో నేరాలకు ఒడిగట్టిన దొంగ గురువులు కోకొల్లలు.అటువంటి నయవంచకుల వాగోతాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికీ నకిలీ బాబాల స్వైరవిహారానికి ఎందుకు అడ్డుకట్ట పడటం లేదు? అని అభ్యుదయ వాది కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యుల అజ్ఞానాన్ని మూఢత్వంలోకి మళ్ళించి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్న రాజకీయ నాయకుల మూలంగా జనభారతానికి వాటిల్లుతున్న నష్టం అంతా ఇంతా కాదనీ కార్మిక వర్గ బోరపుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు కామ్రేడ్ జే కే ఆర్ జెఎస్ఆర్ సార్ కన్నీరు పెట్టుకున్నారు.మీ మూఢనమ్మకాలను ముందు వదిలించుకోండి, ధైర్యంగా ఉండండి,సత్యాన్ని తెలుసుకోండి దాన్నే ఆచరించండి’ అని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి పోరా దేవాన్ష్ జె కె ఆర్ జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ రెడ్ సన్ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 40078 పిలుపునిచ్చారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This