Friday, September 20, 2024
spot_img

టీఎస్ఐఐసీ స్థలాలకు శఠగోపం..

Must Read
  • స్థలాలు కేటాయించింది పరిశ్రమల కోసమా..? ప్రైవేట్ వ్యాపారం కోసమా..?
  • గాడి తప్పిన సాగుతున్న టిఎస్ఐఐసీ అధికారుల పాలన..
  • పఠాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ వింత పోకడ..
  • అక్రమ నిర్మాణాలకు వంత పాడుతున్న దారుణం..
  • అక్రమ నిర్మాణాలను సీజ్ చేశామంటూ కలరింగ్..
  • యదేచ్చగా కొనసాగుతున్న వ్యాపారం..
  • ప్రైవేటు స్థలం అంటూ వందల కోట్లు విలువ చేసే స్థలాన్ని కొల్లగొడుతున్న కేటుగాళ్లు..
  • అవినీతికి పాల్పడి అక్రమాలను సక్రమం చేస్తున్నారా..?
  • టీఎస్ఐఐసి అధికారుల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపితే ఒళ్ళు గగ్గుర్పొడిచే నిజాలు బట్టబయలు అవుతాయి..
  • అక్రమ వ్యవహారాల్లో అధికారులకు వాటాల ఇంకా ముట్ట లేదా..?
  • ముఖ్యమంత్రి గారు టీఎస్ ఐఐసి అక్రమాలపై దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల ఆదాయం..

ఎవరికి నచ్చింది వారు చేసుకుని పోతున్నారు.. నిబంధనలను బే ఖాతరు చేస్తున్నారు.. అక్రమార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.. ఇంత జరుగుతున్నా నిజాయితీ పరులుగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు.. అయితే దురదృష్టం ఏమిటంటే ఇంతటి అవినీతికి పాల్పడుతోంది ఒక మహిళా అధికారిణి.. ఇది చెప్పుకోవడానికి కొంత సిగ్గుచేటుగా ఉన్నా తప్పడం లేదు.. టీఎస్ఐఐసీ స్థలాలకు రెక్కలొచ్చాయి.. యథేచ్ఛగా ప్రయివేట్ వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారు.. ఇంత జరుగుతున్నా ఆ మహిళా అధికారిణికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఎందుకంటే ఆమె అవినీతి సొమ్మును పోగేసుకుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈవిడకి ప్రభుత్వం అంటే లెక్కలేదు.. విధి విధానాలంటే చిన్నచూపు.. నిబంధనలకు పాతర వేసి అందినకాడికి దండుకోవడమే పరమావధిగా విధులు నిర్వహిస్తోంది..

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు నియోజకవర్గం, రామచంద్రపురం మెయిన్ రోడ్ లో బహిరంగ మార్కెట్ లో కోట్లు విలువచేసే టిఎస్ఐఐసి స్థలం ఉంది.. ఇట్టి స్థలాన్ని పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఐఐసీ లీజుకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.. కానీ ప్రస్తుతం అట్టి స్థలం ఖాళీగా బీడుగా ఉండిపోయింది.. ఈ యొక్క స్థలంలో నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి కలిగే కంపెనీ లేదు.. ఈ స్థలంపై కన్నేసిన కబ్జారాయులు.. దొడ్డి దారిన ఆ యొక్క స్థలాన్ని వారి వశం చేసుకొనేందుకు పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. స్థానిక జోనల్ మేనేజర్ అండదండలతో పరోక్ష సహకారాన్ని తీసుకొని లోపాయి కారి ఒప్పందం చేసుకొని యదేచ్ఛగా టిఎస్ఐసి స్థలంలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు.. విషయము పఠాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ దృష్టికి తీసుకెళ్లినా తనకేమీ సంబంధం లేదన్న చందాన వ్యవహరిస్తూ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను స్థాపించి వందలాది మందికి ఉపయోగపడుతుందని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఆ యొక్క స్థలాన్ని టిఎస్ఐసి ఆధ్వర్యంలో కంపెనీలకు అలాట్ చేయాలి అని తెలిపినా.. సంబంధిత వ్యక్తి లీజు నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ అనుమతి లేకుండానే కాసులకు కక్కుర్తి పడి చారు టైల్స్ అండ్ గ్రానైట్స్ సేల్స్ షో రూమ్, ఫైల్ నెక్స్ట్ సేల్స్ షోరూమ్, లక్ష్మీ మార్బు ల్స్ సేల్స్ షోరూం, హైటెక్స్ మార్బుల్స్ సేల్స్ షోరూం, హర్ష టయోటా కార్ షోరూమ్ ల పేరుతో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టి మూడు పూవులు ఆరు కాయలను చందాన వారి వ్యాపారం దర్జాగా కొనసాగిస్తున్నారు…లీజు నిబంధనలు ఉల్లంఘించిన విషయం తెలిసినా టీఎస్ ఐఐసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన జోనల్ మేనేజర్ సీజింగ్ చేశామని ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ.. ప్రాథమికంగా వ్యాపారం చేసుకునే వారితో మూలకత్ అయ్యి పరోక్ష సహకారం అందిస్తుందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.. సీజ్ చేసిన తర్వాత అక్కడ వ్యాపార కార్యక్రమాలు చేపట్టడం గానీ, రాత్రి పనులు చేయడం గాని చేస్తే టి.ఎస్.ఐ.సి అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. కానీ ఆ దిశగా పఠాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ పట్టించుకోకపోవడంతో వారి అవినీతికి ఆమె పరోక్ష సహకారం అందిస్తున్నారనే ఆరోపణకు బలం చేకూరుతుంది.. విషయం టీ.ఏస్.ఐ.ఐ.సి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా జోనల్ మేనేజర్ దగ్గరే సంబంధిత సమాచారం తెలుసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పడం.. అలాగే జోనల్ మేనేజర్ ను ఆశ్రయిస్తే ప్రధాన కార్యాలయంలో తెలుసుకోవాలని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ అక్రమాలను సక్రమం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై.. పరోక్ష సహకారం అందిస్తున్నారనే అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. అధికారుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే అక్రమార్కులకు అండగా నిలిచి, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా వారికి సక్రమం ఎలా చేయాలి అనే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.. టీఎస్ ఐఐసి చట్టంలో చూపిన నిబంధనల ప్రకారం వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. జోనల్ మేనేజర్ కల్లేదుటే ఇంత భారీ అక్రమాలు జరుగుతున్నా ఇప్పటివరకు సదరు అధికారిని విధుల నుండి తొలగించకపోవడంతో ఉన్నతాధికారులకు సైతం ముడుపులు ముట్టాయా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వము ఖాళీ స్థలాలకు టెండర్లు వేసి కంపెనీలకు ఇస్తామని బహిరంగ ప్రకటన చేస్తే.. సదరు స్థలాలకు సంబంధించి వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా ఉంటుంది అని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ.. ఉపాధి కల్పిస్తామని భరోసానిస్తూ ఉంటే.. అధికారులు మాత్రం తమకు ముడుపులు ముడితే చాలు అక్రమాలను సక్రమం చేస్తాం అన్న చందాన అధికారులు వ్యవహరిస్తుండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి పఠాన్ చెరు మెయిన్ రోడ్ లో వెలసిన అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసేసే విధంగా చర్యలు చేపట్టి, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టి, టీఎస్ఐసి అధికారుల అక్రమాలపై విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులను తక్షణమే విధుల నుండి తొలగిస్తే, ప్రభుత్వానికి ఆదాయంతో పాటు మంచి పేరు వస్తుందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.. పటాన్ చెరువు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం సంబంధించి, టీఏస్ ఐఐసి లో జరుగుతున్న వేలకోట్ల అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్”.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This