- సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని బయటపెట్టరాని అన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.ఆదానీని కాపాడడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.సెబీ చైర్ పర్సన్ అక్రమాల పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తిరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పస్టం చేశారు.రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని,ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే విపు విమానాల మోత మొగిస్తామని హెచ్చరించారు.డిసెంబర్ 09న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.