Wednesday, January 22, 2025
spot_img

సైబర్ నేరాలపై పోలీసుల అలెర్ట్

Must Read
  • గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త
  • ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు
  • అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి
  • ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్
  • ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది
  • తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్
  • సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్
  • 2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు

డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో డబ్బులు లేనిదే ఎవరూ బయటకు వెళ్లేవారు కారు. కానీ, నేడు జేబులో రూపాయి లేకుండానే బజారుకు వెళ్తున్నారు. ఏం కొనాలన్నా, తినాలన్నా, తాగాలన్నా డబ్బులతో అక్కర్లేదు. ఎక్కడ చూసిన అన్ని ఆన్ లైన్ పేమెంట్స్. రోడ్డుపై టీ తాగిన, మార్కెట్లో కూరగాయలు తీసుకున్నా స్కాన్ చేసి డబ్బు చెల్లించడం. ఈ రకంగా మనీ ట్రాన్సఫర్స్ చాలా ఈజీ అయిపోయింది. చిన్న గుండు పిన్ను నుంచి కాస్లీ కారు కొనుగోలు చేసేవరకు అంతటా బ్యాంక్ ద్వారా ట్రాన్ జాక్షన్ చేయోచ్చు. “అతి వినయం ధూర్త లక్షణం” అన్నట్టుగా ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు మోపై ఎక్కడ, ఎవరూ ఈజీగా దొరుకుతారు వారిని దోచుకుందాం అని కళ్లు తెరబెట్టి కూర్చున్నారు. ఆఫర్స్, డిస్కౌంట్ పేరుతో అమాయకులను దోచుకుంటున్నారు.

సైబర్ (Cyber Crime) నేరగాళ్లు రోజురోజుకు వినూత్న పద్ధతుల్లో కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు కాజేస్తున్నారు. వారి బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు(Police) అనేక గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను, ఆన్లైన్ పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని చిరుద్యోగులను, రుణ యాప్లతో విద్యార్థులను, సామాజిక మాధ్యమాల వల విసురుతూ డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధులు, వ్యాపారులను బోల్తా కొట్టిస్తుండటంతో ఏటేటా కేసులు పెరుగుతున్నాయి. 2023 సంవత్సరంతో పోల్చుకుంటే 2024లో సైబర్ నేరాల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అయ్యాయి. సైబర్ క్రైమ్‌ల వల్ల తెలంగాణ వాసులు ప్రతిరోజూ రూ. 5 కోట్ల వరకు కోల్పోతున్నట్లు లెక్కలు ద్వారా తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ. 4 కోట్లను క్రిమినల్ సిండికేట్‌లు విదేశాలకు పంపుతున్నట్లు తేలింది. పోలీసు సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫలితం లేకుండా పోతుంది.

సైబర్ నేరం జరిగిన తర్వాత మొదటి కొన్ని గంటల ప్రాముఖ్యతను అధికారులు నొక్కిచెప్పారు. వాటిని ‘గోల్డెన్ అవర్స్‘ అని పోలీసులు చెబుతున్నారు. 2024లో తెలంగాణ బాధితులు సైబర్ క్రైమ్ వల్ల రూ.2,000 కోట్లకు పైగా నష్టపోయినట్టు తేలింది. కొన్ని సందర్భాల్లో, సైబర్‌ అధికారులు.. కోట్లాది రూపాయలను రికవరీ చేయగలిగారు, అయితే విజయవంతమైన అన్ని కేసులలో కీలకమైనది గోల్డెన్ అవర్స్‌లో నివేదించబడినవి. ఓ బాధితుడు రూ. 70 లక్షలు పోగొట్టుకున్నాడు, ఆ వ్యక్తి రూ. 15 లక్షలు మాత్రమే తిరిగి పొందగలిగాడు. అయితే అతను కీలకమైన మొదటి కొన్ని గంటల్లో సంఘటన గురించి నివేదించనందున తక్కువ వచ్చినట్లు అధికారి వెల్లడించారు. అతను పోలీసు ఫిర్యాదును దాఖలు చేయడానికి 10 రోజులు పట్టింది, దానిని వెబ్‌సైట్‌లో నివేదించి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి వెళ్లాడు. సైబర్‌ బాధితులు http://www.cybercrime.gov.in లేదా టోల్-ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు ప్రజల్నీ అలెర్ట్ చేసింది. ఒక్క క్లిక్ తో మీ జీవితాన్ని మార్చేస్తుంది.. అనే పేరుతో ఖాకీలు పోస్టర్స్ రిలీజ్ చేశారు. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు, ఈ మెయిల్స్ ద్వారా ఫేక్ లింక్ లు పెట్టి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అత్యాశతో మీరు చేసే క్లిక్ ద్వారా మీ ఖాతాలోని డబ్బు మాయం అయ్యే ప్రమాదం ఉందని సూచించింది. మీకిష్టమైన వాటిని చూపించి తక్కువ ధరకు ఆ వస్తువులు వస్తున్నాయంటే మిమ్ముల్నీ బోల్తా కొట్టించే ప్రమాదం లేకపోలేదంటూ మన పోలీసులు జనాన్ని మేలుకొలుపుతున్నారు. అత్యాశకు పోతే అనర్థాలకు దారితీసే ప్రమాదాలు ఉన్నట్లు పోస్ట్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఆఫర్స్, డిసౌంట్స్ పై మీరు తెలుసుకొని, వెనుకా, ముందు ఆలోచించి ముందుకు వెళ్లాల్సి అవసరం ఉంది.. మీ అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి ఎమరుపాటుతో ఉండొద్దు అని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని, దీని గురించి మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ కు కూడా విప్పి చెప్పాల్సిందిగా సూచన చేయడం జరుగుతుంది.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS