తెలంగాణ పోలీస్ శాఖ ను కుదిపేసిన డేటా హ్యాకింగ్ ఘటన లో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు.. నిందితుడు ఇరవై ఏళ్ల కుర్రాడిగా తేల్చారు…
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ కి చెందిన జతిన్ కుమార్ నోయిడా లో నివసిస్తూ చదువుకుంటున్నట్లు తెలిసింది.. తెలంగాణ పోలీస్ శాఖ కు చెందిన హ్యక్ ఐ మొబైల్ యాప్ సహా టిఎస్ కాప్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన జతిన్ అందులో ఉన్న అత్యంత కీలక డేటా ను అన్ లైన్ లో 150 అమెరికన్ డాలర్లకు బేరానికి పెట్టినట్లు తెలిసింది. ఆన్ లైన్ లో తనను కాంటాక్ట్ చేయడానికి నిందితుడు ఇన్ స్టాగ్రామ్ ఐడి లను డిస్ ప్లే లో పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు.. నిందితుడు జతిన్ పాత నేరస్థుడని, గతంలో సైబర్ నేరాలకు పాల్పడి ఒకసారి అరెస్ట్ అయ్యాడని, ఆధార్ డేటా లీకేజీ కేసు లో కూడా నిందితుడి పై కేసు ఉందని తెలంగాణ డీజీపీ తెలిపారు… నిందితుడి అరెస్ట్ పై డిజిపి కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది..!
Must Read