- పక్క సమాచారంతో నీల్వాయి పోలీసుల తనిఖీలు
- ఎద్దుల బండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
- నకిలీ పత్తి విత్తనాలు విలువ రూ 6,75,000/-
- ఒకరి అరెస్ట్ , పరారీలో మరో ముగ్గురు
అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠాను నీల్వాయి పోలీసులు అరెస్ట్ చేశారు.ముందస్తు సమాచారంతో పోలీసులు,వ్యవసాయ అధికారులు వేమనపల్లి ఫెర్రీ పాయింట్ వద్ద తనిఖీలు చేపట్టి ఎద్దుల బండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ 6,75,000/- వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లాలో విక్రయించి అధిక లాభం పొందాలనే ఉద్దేశ్యంతోనే నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసున్న పోలీసులు ఎద్దుల బండిను , రెండు ఎద్దులను స్వాధీనం చేసుకొని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏ-1 కోలా సాయికిరణ్ ను అరెస్ట్ చేశారు.మిగితా ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
నకిలీ విత్తనాలు మరియు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ మరియు కానిస్టేబుల్ రాజేందర్,రాజశేఖర్ లను సీపీ అభినందించి రివార్డ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపీఎస్,అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజూ ,జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్,నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ పాల్గొన్నారు.