Saturday, September 6, 2025
spot_img

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

Must Read
  • హుస్నాబాద్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో ఎల్లమ్మ చెరువు వద్ద 45 లక్షలతో మైనారిటీ లకు షాదిఖానా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందించ‌డ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాల సమస్యలను మార్చి తరువాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌ లకు సంబంధించి స్థానికులపై ఉన్న కేసులు ఎత్తివేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని అన్నారు. సీఎంతో పాటు తన మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This