Sunday, September 7, 2025
spot_img

ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు..

Must Read
  • వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…?
  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు
  • ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం
  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆరోగ్యశ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్న్నాం : మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయ‌ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్(Ponnam Prabhakar) తెలిపారు. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్ కార్డులు రానివారు కానీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారు.. కావునా ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అంతేగాక రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 10 వేల రూపాయలను 12 వేలకు పెంచడం జరిగిందని, దేశంలోనే మొదటి సారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ ఆరోగ్య శ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్నామని, రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చామని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల మాదిరి ఈనెల లోనే మరో 4 పథకాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. గ్రామాల్లో నేటి నుండి గ్రామ సభలు జరుగుతుండడంతో ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు , ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఉంటే అధికారులకు మీ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల పై జరుగుతున్న తప్పుడు సమాచారంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వారికి కాంగ్రెస్ క్యాడర్ అండగా నిలబడాలి! అని పొన్నం సూచించారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This