- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన నిరాశ,భయాన్ని కలిగించిందని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు,వైద్యులు,పౌరులు నిరసనలు తెలుపుతుంటే నిందితులు మాత్రం స్వేచ్చాగా తిరుగుతునట్లు వ్యాఖ్యనించారు.సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలని,కఠిన ప్రశ్నలు వేసుకోవాలని సూచించారు.కూతుళ్లు,అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని తెలిపారు.భారతదేశం చరిత్రను చతురస్రంగా ఎదుర్కోవాలి.ఈ వక్రబుద్ధిని సమగ్రంగా ఎదుర్కొందాం..దీన్ని ప్రారంభంలోనే అరికట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
.