Friday, September 20, 2024
spot_img

రియల్ దందాతో… భారీ మోసం

Must Read
  • ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం
  • రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్
  • యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా
  • రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్
  • ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా
  • స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్
  • జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం
  • ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు
  • రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం
  • ప్రేక్ష‌క పాత్ర‌లో గ్రామ‌పంచాయ‌తీ, కార్య‌ద‌ర్శి

తెలంగాణ రాష్ట్రంలో రియల్ దందా జోరుగా సాగుతుంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి కోట్లల్లో సంపాదించాలనే ఆపచ్చనతో కొంతమంది ఈ దారి వెతుక్కుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లుగా తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన లక్షల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూమి పలుకుతుంది అంటే అతిశయోక్తి కాదు. గ‌త బీఆర్ఎస్ సర్కార్ భూముల ధరలను అమాంతం పెంచి పేద, మధ్య తరగతి ప్రజలు కొనలేని, సొంతంగా ఇల్లు కట్టుకోలేని దుస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల యాడ్స్, అందమైన బ్రోచర్స్, ప్రముఖులతో ప్రచారాలు చేయించుకుంటూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. రియల్ భూమ్ మాయలోపడి సామాన్య ప్రజానీకం ఎందరో మోసపోవడం వాళ్ల వంతు అవుతుంది. భూమి పెట్టుబడితే ఎక్కడికి పోదు అన్న పెద్దల మాటను నమ్మి.. ఐదు, పదేళ్లల్లో రెట్టింపు, డబుల్ రెట్టింపు అవుతుందనే ఆశతో పైసా పైసా కూడబెట్టి, కొంత అప్పుజేసి బ్రోకర్ల ద్వారా రియల్ ఎస్టేట్ ను సంప్రదించి గుట్టలు, పుట్టలు, వ్యవసాయానికి ఎందుకు పనికిరాకుండా పోయిన వాటిని వెంచర్లు గా మార్చి దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, పూర్తిగా ల్యాండ్ ఆ సంస్థ పేరున లేకున్నా అమాయకులకు కట్టబెట్టి అవతలపడడం గమనార్హం.

ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండ‌లం తోలుక‌ట్ట గ్రామంలో మ‌రో ఫ్రీ లాంచ్ పేరుతో ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్ భారీ మోసానికి తెరలేపింది. ‘ఇల్లు పీకి పందిరి వేసినట్లు’ రాయ‌ల్ ఫామ్స్ పేరుతో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసిన పేదలను మోసం చేయడం వాళ్ల అలవాటుగా మారిపోయింది. ఫామ్ ప్లాట్స్ కోసం ఫ్రీ లాంచ్ ఆఫ‌ర్ల‌తో ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్ మోసానికి పాల్ప‌డుతున్నారు. ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్ రాయ‌ల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో ప్రజలను నిండా ముంచుతున్నారు. ‘ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు’ కొందరు మోసపోతున్నారు. ఫ్రీ లాంచ్ అంటూ అమాయకులను బ్రోచర్లు, కలర్ యాడ్స్ తో బొక్కాబొర్లపడేస్తున్నారు. పేద ప్ర‌జ‌ల నుండి లక్షల్లో డ‌బ్బులు వ‌సూలు చేసి కోట్లల్లో డబ్బులు కూడబెట్టి అవతలపడుతున్నారు. స‌ర్వే నెంబ‌ర్ 167లోని 10 ఎక‌రాల్లో కొత్తగా వెంచర్ చేసి భారీ మోసానికి పాల్పడుతున్నారు. ‘గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?’ అన్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన కొందరు పెట్టుబడిదారులు అదేపనిగా జనాన్ని బొల్తా కొట్టించడంపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకున్నా.. అసలు ఆ భూమి అమ్ముకోవడానికి, కొనడానికి సౌకర్యం లేకున్నా రంగుల ప్రపంచం సీన్ క్రియేట్ చేసి భూమి కొనేలా చేస్తున్నారు. హెచ్ఎండిఏ నుండి కానీ, డిటిసిపి నుండి కానీ ఎలాంటి అనుమ‌తులు లేకుండా సంస్థ ఫామ్ ప్లాట్స్ పేరుతో అమ్మ‌కాలు చేస్తూ ప్ర‌జ‌ల‌ను ద‌గా చేస్తున్నారు.. ఒక్కో ప్లాట్ కు ఒక్కో రేటు పెట్టి ఆశచూపుతున్నారు. భూమి కొనేటప్పుడు ఒకరిద్దరినీ సంప్రదించకుండా ఆ వెంచర్ పై ఎలాంటి అనుమానాలు నివృత్తి చేసుకోండా టకిటకీమనీ డబ్బులు కట్టేసి దానిలో పూర్తిగా మునిగిపోయినాక పెద్దలు, తెలిసిన వారికి చెబుతున్నారు. అప్పటికే జరిగాల్సి అంతా జరిగిపోతుంది. ఇంకేముంది ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ రోడ్డు మీదకెక్కి లబోదిబోమంటే ఏమి ప్రయోజనం.

ఒక్కో సైజుకి, ఒక్కో దిక్కుకి ఒక్కో రకంగా రేట్లు పెట్టి జనాన్ని మరింత మోసం చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. 100 గజాలు అయితే ఇంత, 200 అయితే ఇలా, 300 తీసుకొంటే మరోలా, అదే 500, 1000 గజాలు తీసుకొంటే అదీ ఫ్రీ, ఇదీ ఫ్రీ, ఇల్లు కూడా కట్టిస్తామనే అనేకరకమైన ఆఫర్స్ పెడుతూ ఆశచూపి భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్ రేట్లు…
మొత్తం 65 ప్లాట్స్‌..
125 స్వ్కేర్ యార్డ్‌కు అవుట్‌రేట్ 14,000/-, 3 నెల‌ల‌కు రూ.15,000/- మొత్తం అవుట్‌రేట్ – రూ. 73,92,000/-
3 నెల‌ల‌కు మొత్తం – రూ. 79,20,000/-

ఇన్‌స్టాల్‌మెంట్ ప‌ద్ద‌తిలో – డౌన్‌పేమెంట్ రూ.25 ల‌క్ష‌లు,
మొద‌టి, రెండ‌వ, మూడ‌వ‌ ఇన్‌స్టాల్‌మెంట్ లో రూ. 48,92,000/-
కార్న‌ర్ ప్లాట్ అయితే గ‌జానికి రూ. వెయ్యి ఎక్కువ‌ వసూలు చేస్తున్నారు.

రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దల అండ, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో రియల్ భూమ్ పేరుతో వెంచర్లు చేసి సరికొత్త దందా చేస్తున్న ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ వంటి వాటిపై గవర్నమెంట్ దృష్టిసారించకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, పంచాయ‌త్‌రాజ్ శాఖ, ఇతర ముఖ్యశాఖల అధికారుల అండదండలతోనే ఈ రియల్ ఎస్టేట్ దందా సాగుతుందని.. దానికోసం వారికి వాటాలు, మాముళ్లు రూపంలో పెద్ద మొత్తంలో డ‌బ్బులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకేంటి అమాయకులు ఎవరో నష్టపోతే వారికేంటి వాళ్ల జేబులు నిండితే చాలు కదా అన్నట్టే చూస్తున్నారు.

ఒక్క రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండ‌లం తోలుక‌ట్ట గ్రామంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి రియల్ భూమ్ దందాల ద్వారా లక్షల్లో మోసపోయిన అమాయకులు ఎందరో ఉన్నారు. ఇకనైన ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This