- ఆ దేశ ప్రధానితో కలిసి రెండో రోజు సింగపూర్లో పర్యటించిన మోదీ
-ప్రముఖ సెమికండెక్టర్ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించిన మోదీ - గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికలపై చర్చ
- ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో కాసేపు చర్చ
- సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ఆహ్వానించిన మోదీ
- అభివృద్ది చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక ఉదాహరణ
రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ గురువారం సింగపూర్లో పర్యటించారు.ఈ సంధర్బంగా ప్రముఖ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించారు.సింగపూర్ పీఎం వాంగ్‌తో కలిసి గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చించారు.ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్,సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి,భారత్‌తో సహకారానికి ఛాన్సులపై ప్రధాని మోదీకి తెలియజేసింది.అనంతరం ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో ప్రధాని మోదీ చర్చించారు.సింగపూర్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ ఇంటర్న్‌లతో పాటు జెII- ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ఇండియా రెడీ టాలెంట్ ప్రోగ్రాం కింద భారతదేశాన్ని సింగపూర్ ఇంటర్న్‌లు సందర్శించారు.ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను మోదీ ఆహ్వానించారు.అభివృద్ది చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక ఉదాహరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.నైపుణ్య శిక్షణ,డిజిటలైజేషన్,మొబిలిటీ,తయారీ ,సెమికండక్టర్లు,ఏఐ,ఆరోగ్య సంరక్షణ,సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలలో సహకరించుకోవడం పై చర్చించమని తెలిపారు.