పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ అధ్యక్షులు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.అనంతరం యుద్ధం,తాజాగా జరుగుతున్న పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.