రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై ప్రధాని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.