Friday, November 22, 2024
spot_img

లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ప్రధాని మోదీ

Must Read
  • నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు
  • లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ
  • తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు
  • మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
  • రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.మూడోసారి దేశప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ మొదటిగా లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం మిగితా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.మొత్తంగా (సోమవారం) తొలిరోజు 280మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.మిగిలిన సభ్యులు మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

లోక్ సభ సమావేశాల కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.మూడోసారి ప్రధానిగా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు భారతదేశంలో నిర్వహించమని,ఈ ఎన్నికల్లో 65 కోట్ల మంది పాల్గొన్నారని తెలిపారు.మా విధానాలకు,అంకితభావానికి ప్రజలు పట్టం కట్టరాని,వరుసగా మూడోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు.కొత్త ఆశయాలతో,నూతన ఉత్సాహంతో సభ్యులు ముందుకు కొనసాగాలని,కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని కోరారు.రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటామని తీసుకుంటామని తెలిపారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు.2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం,లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కొనసాగుతామని ఈ సంధర్బంగా ప్రధాని మోదీ తెలిపారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS